మెగా హీరోతో ఛాన్స్ కొట్టేసిన కావ్య..?

Pulgam Srinivas
చిన్న తనంలో ఎన్నో సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన కావ్య కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ప్రస్తుతం సినిమాలలో హీరోయిన్గా నటిస్తుంది. అందులో భాగంగా కొంత కాలం క్రితం ఈ బ్యూటీ హర్రర్ జోనర్ మూవీ అయినటువంటి మసుధ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈమెకు మంచి గుర్తింపు హీరోయిన్గా లభించింది. ఆ తర్వాత ఈ బ్యూటీ ప్రియదర్శి హీరోగా వేణు దర్శకత్వంలో రూపొందిన బలగం సినిమాలో హీరోయిన్గా నటించింది.

ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడం , ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ బ్యూటీ కి తెలుగు లో ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు రావడం మొదలు అయింది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమాలలో నటించిన ఈమె ఆ తర్వాత తన నటనతో మాత్రమే కాకుండా , అందాలతో కూడా ప్రేక్షకులను అలరించడం మొదలు పెట్టింది. ఇక ప్రస్తుతం ఈమె అనేక సినిమాలలో నటిస్తూ బిజీగా కెరీర్ ను ముందుకు సాగిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ కి మరో క్రేజీ సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన మెగా హీరోలలో ఒకరు అయినటువంటి సాయి ధరమ్ తేజ్ హీరోగా రోహిత్ దర్శకత్వంలో హనుమాన్ ఫెం నిరంజన్ రెడ్డి నిర్మాణంలో ఓ సినిమా స్టార్ట్ కాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో సాయి ధరమ్ తేజ్ కు జోడిగా కావ్య ను మేకర్స్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక నిజం గానే ఈ సినిమాలో కావ్య కు గనుక హీరోయిన్ అవకాశం వచ్చినట్లు అయితే ఈ బ్యూటీ మరో టాలీవుడ్ క్రేజీ మూవీ లో ఛాన్స్ కొట్టేసినట్లే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

kkr

సంబంధిత వార్తలు: