ఉస్తాద్ హీరో ఆ విషయాన్ని ఎందుకు దాస్తున్నట్టు?

Anilkumar
ఉస్తాద్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. అయితే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు రామ్.  తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈయన డబ్బులు ఇస్మార్ట్ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఇక ఈ సినిమా అయిపోయిన తర్వాత రామ్ ఎవరితో నెక్స్ట్ మూవీ చేయాలి అని ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. పలువురు దర్శకులను కూడా  రామ్ ఇప్పటికే లైన్లో పెట్టుకున్నట్టు తాజా వార్తలు వినిపిస్తున్నాయి. 

ముఖ్యంగా చెప్పాలంటే త్రివిక్రమ్ తో కలిసి రామ్ ఒక సినిమాను చేయాలని ఎన్నో రోజుల నుండి అనుకుంటున్నారు. కానీ వీరిద్దరి కాంబోలో మాత్రం ఇప్పటి వరకు ఒక సినిమా కూడా సెట్ అవ్వడం లేదు. అయితే తాజాగా వీళ్ళిద్దరి మధ్యలో ఒక సినిమా రాబోతున్నట్టు  వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా కిషోర్ తిరుమల దర్శకత్వంలో కూడా ఈయన ఒక సినిమా చేయబోతున్నాడు అని వార్త వినిపిస్తోంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఇప్పటికే రామ్ రెండు సినిమాలు చేయగా ఆ చిత్రాల పై ఆయన  మంచి ప్రశంసలను అందుకున్నాడు. 

ఇక మళ్ళీ  వీళ్ళ ఇద్దరి కాంబినేషన్లో మరొక సినిమా తెరకెక్కనుంది. రామ్ తన నెక్స్ట్ సినిమాలని లైన్ లో పెట్టినప్పటికీ కూడా ఆ మూవీస్ ను అనౌన్స్ చేయడానికి ఎందుకో ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే డబ్బులు ఇస్మార్ట్ షూటింగ్ అంతా పూర్తయిన తర్వాత ఆయన చేసే నెక్స్ట్ సినిమాల గురించి అనౌన్స్మెంట్ ప్రస్తావన తీసుకురావాలని ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పోయిన ఏడాది లో స్కంద సినిమాతో బారి డిజాస్టర్ ని అందుకున్నాడు రామ్. అందుకే ఈ సినిమా పట్ల ఆయన ఆచితూచి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: