ఏపీలో కూటమి విజయంపై కీలక వ్యాఖ్యలు చేసిన సుమన్..!

MADDIBOINA AJAY KUMAR
సినీ నటుడు సుమన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . సుమన్ ఇప్పటి వరకు ఎన్నో తెలుగు సినిమా లలో నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పాటు చేసుకున్నాడు . చాలా సంవత్సరాల క్రితం ఎన్నో సినిమాల లో హీరో గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన హీరో గా కెరియర్ ను కొనసాగించిన ఈ నటుడు ఈ మధ్య కాలం లో సినిమాల్లో కీలక పాత్రలలో , ముఖ్య పాత్రలల్ నటిస్తూ కెరీర్ ను ముందుకు సాగిస్తున్నాడు.

తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికలలో తెలుగు దేశం , జనసేన , బి జె పి మూడు పార్టీలు కలిపి పొత్తుల భాగంగా పోటీలోకి దిగాయి. ఈ మూడు పార్టీల కూటమి కి అద్భుతమైన అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. కూటమి అధికారం లోకి వచ్చింది. ఇక దీనిపై తాజాగా సుమన్ ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. రాష్ట్ర ప్ర‌జ‌లు స్వచ్ఛమైన తీర్పు జ్ ఇచ్చార‌ని , ఈ గెలుపు ఎవ‌రూ ఊహించలేదు అని సుమన్ అన్నారు. కూట‌మి విజ‌యం కోసం ప‌వ‌న్ ఎంతో క‌ష్ట‌ప‌డ్డార‌ని సుమన్ తెలిపారు.

ఏపీ లో సినీ ఇండ‌స్ట్రీ బాగా వెనుక‌ప‌డిపోయింద‌ని , షూటింగ్స్ పెరిగేందుకు కావాల్సిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆయన కోరారు. ఈ విష‌యం లో చంద్ర‌బాబు , ప‌వ‌న్ చాలా ఫోక‌స్ చేయాల‌ని ఆయ‌న సూచించారు. ఇక అమరావ‌తిని అమెరికాలా చేయాలంటే అది కేవ‌లం చంద్ర‌బాబు తోనే సాధ్య‌మ‌వుతుంద‌ని సుమన్ పేర్కొన్నారు.  హైద‌రాబాద్ ఆర్కిటెక్చ‌ర్ కూడా బాబుగారేన‌ని సుమ‌న్ తాజాగా అభివ‌ర్ణించారు. ఇక తాజాగా సుమన్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం సుమన్ అనేక సినిమాలలో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: