ఆమెను హీరోయిన్ గా తీసుకుంటే.. నేను సినిమా నుంచి తప్పుకుంటా : సేతుపతి

praveen
సాధారణంగా ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఒక భాషా నటుడు కేవలం అదే భాషలో అవకాశాలను దక్కించుకోవడం ఇక స్టార్లుగా ఎదగడం జరిగేది. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఏకంగా ఒక భాషలో నటించిన నటుడు మరో భాషలో కూడా మంచి అవకాశాలు అందుకోవడం చూస్తున్నాం. ఈ క్రమంలోనే ఇలా ఒక భాషలో హీరోగా చేసిన వారు మరో లాంగ్వేజ్ లో విలన్ లేదా వైవిద్యమైన పాత్రలు చేయడానికి కూడా రెడీ అవుతున్నారు. ఇలా నేటి రోజుల్లో వైవిద్యమైన పాత్రలతో అలరిస్తున్న నటులలో అటు విజయ్ సేతుపతి కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే.

 ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ సేతుపతి.. తన నటనతో అంచలంచలుగా ఎదిగాడు. తమిళ ప్రేక్షకులందరికీ కూడా మక్కల్ సెల్వన్ గా మారిపోయాడు విజయ్ సేతుపతి. అయితే కేవలం హీరో లాంటి పాత్రలు వస్తేనే చేస్తాను అని కూర్చోకుండా.. ఇక ఇతర హీరోల సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు వస్తే చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పటికే తెలుగులో కూడా ఎన్నో సినిమాల్లో నటించాడు  అయితే బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాలో ఏకంగా హీరోయిన్ తండ్రి పాత్ర పోషించి.. తన నటనతో ఆకట్టుకున్నాడు అన్న విషయం తెలిసిందే.

 అయితే విజయ్ సేతుపతి ఇలా తండ్రి పాత్రలో నటిస్తే.. ఆయన కూతురు పాత్రలో హీరోయిన్ కృతి శెట్టి  నటించింది. అయితే ఆ తర్వాత కాలంలో ఒక ఇంటర్వ్యూలో కృతి శెట్టి  సరసన హీరోయిన్గా నటించే ఛాన్స్ వస్తే ఆమెతో నటిస్తారా అని అడిగితే నిర్మొహమాటంగా నటించను అని చెప్పేసాడు విజయ్ సేతుపతి. ఇక ఇప్పుడు చెప్పింది చేసేసాడట. కృతి శెట్టి కి జోడిగా నటించడం తన వల్ల కాదని విజయ్ సేతుపతి అన్నారట. DSP సినిమాలో ఆమెను హీరోయిన్గా తీసుకుంటే తాను నటించనని దర్శక నిర్మాతలకు చెప్పేశాడట. ఎందుకంటే ఉప్పెన సినిమాలో ఆ అమ్మాయికి తండ్రి పాత్రలో నటించడమే ఇందుకు కారణం అని దర్శక నిర్మాతలతో అన్నాడట. అయితే గతంలో కూడా ఇలా తన కూతురుగా నటించిన కృతి శెట్టితో రొమాంటిక్ సన్నివేశాలు నటించే ఛాన్స్ లేదని ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చాడు అనే విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: