లారెన్స్ కాంచన 4 పై దిమ్మ తిరిగే అప్డేట్ ..?

lakhmi saranya
కోలీవుడ్ సినిమా సహా తెలుగులో కూడా మంచి హిట్ అయిన హారర్ సినిమాలలో రాఘవ లారెన్స్ హీరోగా నటించిన కాంచన కూడా ఒకటి. ఒకానొక సమయంలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారు వరకు ఈ సినిమా చూసి భయానికి గురయ్యారు. ఇక ఈ సినిమాలో ఎంత అయితే భయం ఉంటుందో అంతకి రెట్టింపు కామెడీ ఉంటుంది. కోవై సరళ వంటి గొప్ప గొప్ప నటీనటులు ఈ చిత్రంలో నటించారు. ఇక మొదటి భాగం మంచి విజయం దక్కడంతో రెండు, మూడు భాగాలను కూడా ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చా. ఇక ఈ భాగాలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే హారర్ అండ్ కామెడీ జోనర్ లో మంచి ట్రెండ్ ని తాను సెట్ చేసి అన్ని సినిమాలు భారీ హిట్ అందుకున్నాడు.
ఇక ఈ సినిమాలో కొత్త సీక్వెల్ ఉన్నట్టు కూడా హిట్ ఇచ్చారు. కానీ ఇది ఎప్పుడు మొదలవుతుంది అనేది ఇంకా క్లారిటీ లేదు. ఇక ఫైనల్ గా ఇప్పుడు ఈ సీక్వెల్ స్టార్ట్ అవుతుంది అనేది వినిపిస్తుంది. లేటెస్ట్ టాలీవుడ్ వర్గాలు సమాచారం ప్రకారం ఈ ఏడది డిసెంబర్లో ఈ మూవీ షూటింగ్ మొదలుకానుందట. ఇక ఈ చిత్రాన్ని కూడా లారెన్స్ ని రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇక లారెన్స్ విషయానికి వస్తే.. సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి మనసును చాటుకుంటున్నాడు. తను సినిమాలపై సంపాదించే డబ్బును మొత్తం సేవా కార్యక్రమాలకి పెడుతూ మనసున్న హీరో అనిపించుకుంటున్నాడు. ఇక ఇటీవలే లారెన్స్ తన తమ్ముడికి కారును బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. తన తమ్ముడు చేసిన సినిమా తనకి నచ్చడంతో ఈ కారును బహుమతిగా ఇచ్చినట్లు పేర్కొన్నాడు లారెన్స్. ప్రస్తుతం తెలుగులో అయితే ఎటువంటి సినిమా చేయడం లేదు. మరోసారి లారెన్స్ తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: