అడవిశేషు ఆలస్యం వెనుక ఆంతర్యం !

Seetha Sailaja
2011లో ‘పంజా’ మూవీలో పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరే అతిధి పాత్రలో నటించిన అడవిశేషు ఇప్పటివరకు నటించిన సినిమాల సంఖ్య 10 లోపు మాత్రమే. అయినప్పటికీ అతడి పేరు ఎరగని వారుండరు. 2016 లో వచ్చిన ‘క్షణం’ మూవీ అడవిశేషు కెరియర్ ను ఒక మలుపు తిప్పింది. ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అంతా ఈ యంగ్ హీరో చేస్తే ఈ మూవీకి రవికాంత్ పేరపు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

ఈమూవీ హిట్ అవ్వడంతో ఈ యంగ్ హీరోకు అనేక అవకాశాలు వచ్చినప్పటికీ చాల సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు. ‘ఎవరు’ ‘గూఢచారి’ ‘మేజర్’ సినిమాలు ఇతడి రేంజ్ ని మరింత పెంచాయి. ముఖ్యంగా ‘మేజర్’ మూవీ ఘన విజయంతో ఈ యంగ్ హీరో ఇమేజ్ జాతీయ స్థాయికి వ్యాపించింది. ప్రస్తుతం ‘గూఢచారి 2’ సీక్వెల్ లో నటిస్తూ డెకాయిట్ మూవీలో కూడ ఈ యంగ్ హీరో నటిస్తున్నాడు.

ఈమూవీలో సాయి పల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు మూవీలు కూడ పాన్ ఇండియా రేంజ్ సినిమాలు కావడంతో ఈ రెండు సినిమాల పై కూడ భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ రెండు సినిమాలు విడుదల కాకుండానే అడవిశేషు కు అనేక అవకాశాలు వస్తున్నప్పటికీ ఈ యంగ్ హీరో ఆ అవకాశాల గురించి పెద్దగా పట్టించుకోకుండా ఈ రెండు సినిమాల విషయం పైనే పూర్తిగా తన దృష్టి పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వాస్తవానికి యంగ్ హీరోలు అంతా వరసపెట్టి సినిమాలను విడుదల చేస్తూ తమ మార్కెట్ ను అదేధంగా తమ పారితోషికాలను పెంచుకుంటూ పోతుంటే అడవిశేషు మాత్రం ఈ రేస్ లో ఎందుకు వెనకపడుతున్నాడు అంటూ అతడి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. మంచి నటుడు మాత్రమే కాకుండా రచయితగా స్క్రీన్ ప్లే రైటర్ గా మంచి అభిరుచి ఉన్న ఈ యంగ్ హీరో దర్శకుడుగా కూడ రాణించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: