దేవరను కార్నర్ చేస్తున్న రజనీకాంత్ !

Seetha Sailaja
ఆర్ ఆర్ ఆర్’ విడుదలై మూడు సంవత్సరాలు దాటిపోయినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ నుండి మరొక సినిమా ఇప్పటివరకు విడుదల కాకపోవడంతో తారక్ అభిమానులు మాత్రమే కాకుండా సగటు సినీ ప్రేక్షకుడు కూడ తారక్ నటిస్తున్న ‘దేవర’ మూవీ గురించి ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్నాడు. కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో తీస్తున్న ‘దేవర’ మూవీ ఈసమ్మర్ లోనే విడుదలకావలసి ఉంది.

అయితే ఎన్నికలు ఐపిఎల్ టొర్నమెంట్ మ్యానియా రీత్యా జూనియర్ ‘దేవర’ మూవీ సమ్మర్ రేస్ నుండి అక్టోబర్ 10కి వాయిదా పడిన విషయం అందరికీ తెలిసిందే. ఈమూవీ ప్రమోషన్ ను జాతీయస్థాయిలో చేయబోతున్నారు. దీనితో ‘దేవర’ మూవీని ప్రమోట్ చేస్తూ దక్షిణాది రాష్ట్రాలు అదేవిధంగా ఉత్తరాది రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో ‘దేవర’ ని ప్రమోట్ చేయడానికి ఇప్పటి నుండే యాక్షన్ ప్లాన్ ను ఈమూవీ నిర్మాతలు కార్యచరణలో పెట్టారు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఈమూవీకి సంబంధించిన టైటిల్ సాంగ్ ఇప్పటికే ఛార్ట్ బస్టర్ అయిన విషయంతెలిసిందే. అయితే ఇప్పటివరకు రిలీజ్ అయిన చాల సినిమాలు సరైన కథా బలం లేకపోవడంతో పెయిల్ అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. దీనితో ‘దేవర’ కథ విషయంలో కూడ జరిగింది అంటూ కొందరు ఈమూవీని టార్గెట్ చేస్తూ అనేకమంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఈసినిమా దసరా పండుగను టార్గెట్ చేస్తూ విడుదలకాబోతోంది. ఈమూవీ కోసం జాన్వీ పడిన కష్టాలకు సంబడించి ఆమె ఇస్తున్న లీకమలు విని తారక్ అభిమానులు విపరీతంగా టెన్షన్ పడుతున్నారు దీనికి కారణం అదే అక్టోబర్ 10న సూపర్ స్టార్ రజనీకాంత్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న వెట్టయన్ మూవీ దేశవ్యాప్తంగా అదేరోజు విడుదల కాబోతోంది. గత సంవత్సరం అక్టోబర్ 10న విడుదలైన ‘జైలర్’ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ విడుదల చేస్తున్నారు. అయితే ఈమూవీ కూడ పాన్ ఇండియా మూవీ కావడంతో ‘దేవర’ కు ఊహించని కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: