హాట్ టాపిక్ మారిన రెహమాన్ మ్యానియా !
ప్రస్తుతం రెహమాన్ తెలుగులో రామ్ చరణ్ బుచ్చి బాబుల కాంబోలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీకి సంగీత దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీలో సంచలన మూవీ ప్రాజెక్ట్ గా రణబీర్ కపూర్ సాయి పల్లవిల కాంబినేషన్ లో రూపొందుతున్న ‘రామాయణం’ మూవీకి కూడ రెహమాన్ సంగీత దర్శకుడుగా ఎంపిక విషయం తెలిసిందే.
ఈమూవీకి కూడ రెహమాన్ కు 12 కోట్ల భారీ పారితోషికం ఆఫర్ చేసినట్లు బాలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది. అదేవిధంగా కమలహాసన్ మణిరత్నంల కాంబినేషన్ లో ‘తగ్ లైఫ్’ మూవీ జయం రవి హీరోగా నిర్మాణంలో ఉన్న మరొక మూవీకి ‘లాహోర్ 1947’ ధనుష్ మరో మూవీ ‘తేరే ఇష్క్ మేన్’ విక్కీ కౌశల్ రష్మిక మందన్నతో తీస్తున్న ‘చావా’ మూవీలకు మాత్రమే కాకుండా ఇంకా మరో భారీ సినిమాలకు సంగీత దర్శకత్వం వాహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
వాస్తవానికి గత కొన్ని సంవత్సరాలుగా రెహమాన్ ట్యూన్ చేస్తున్న పాటలు నెటితరం ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చడంలేదు అన్న విమర్శలు ఉన్నాయి. మూడు దశాబ్దాల రెహమాన్ సంగీత దర్శకత్వం వహించిన ‘ప్రేమికుడు’ ‘బొంబాయి’ ‘భారతీయుడు’ సినిమాలలోని పాటల స్థాయిలో నేడు రెహమాన్ పాటలకు క్యాచీగా ట్యూన్స్ ఇవ్వలేకపోతున్నాడు అన్న విమర్శలు కూడ ఉన్నాయి. అయితే ఈవిషయాలను ఏమాత్రం పట్టించుకోకుండా అతడికి వస్తున్న భారీ సినిమాల అవకాశాలు అతడి మ్యానియాను సూచిస్తున్నాయి..