పెళ్లికి ముందే హనీమూన్ ని ఎంజాయ్ చేస్తున్న సిద్ధార్థ్ - అదితి.. ఫొటోస్ వైరల్..!

lakhmi saranya
హీరో సిద్ధార్థ్, అదితి రావు హైదరి గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక వీటన్నిటిని వారు కూడా అంగీకరిస్తూ ఇటీవల సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని ఫాన్స్ కి షాక్‌ ఇచ్చారు. త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకుంటామని ప్రకటించారు. ఎంగేజ్మెంట్ కి ముందు కూడా ఈ ఇద్దరూ కలిసి సోషల్ మీడియాలో ఫోటోలు మరియు వీడియోలు షేర్ చేశారు. ఇక నిశ్చితార్థం తర్వాత రెగ్యులర్ గా కలిసి కనిపిస్తూ ఫోటోలు మరియు వీడియోలను షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు.
ఇక తాజాగా సిద్ధార్థ్, అదితి రావు జంట గా హనీమూన్ కి వెళ్ళినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ జంట ఇటలీ దేశంలోని టస్కనీ కి వెకేషన్ కి వెళ్లారు. అక్కడ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ క్లోజ్ గా దిగిన ఫోటోలు ఇద్దరూ కూడా తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలు షేర్ చేస్తూ.. టస్కనీ లో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకుని హనీమూన్ కి ఇటలీ వెళ్లారంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఇక వీరిద్దరి పెళ్లి డిసెంబర్లో జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఇటీవలే  హీరామండి వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అదితి మంచి విజయాన్ని సంపాదించుకుంది. సంజయ్ లీల భన్సాలి డైరెక్షన్లో రూపొందిన ఈ సిరీస్ కి ప్రెసెంట్ మంచి డిమాండ్ ఉంది. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సిరీస్ ని రూపొందించాడు డైరెక్టర్. ఇక సంజయ్ లీలా భన్సాలీ ఓటీటీలోకి అడుగు పెడుతూ చేసిన తొలి వెబ్ సిరీస్ నే ఈ హిరామండి వెబ్ సిరీస్. దీంతో ఈ వెబ్ సిరీస్ పై మంచి హైప్స్ ఏర్పడ్డాయి. ఇక రిలీజ్ అనంతరం ఈ హైబ్స్ ను అందుకోగలిగింది ఈ సిరీస్. ఇక మరోపక్క సిద్ధార్థ్ సైతం ఇండియన్ 2 లో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: