ట్రెండీ వేర్ లో చందమామ అందాలు..!

Anilkumar
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చందమామగా గుర్తింపు తెచ్చుకున్న కాజల్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ భాషలో కూడా ఎన్నో సినిమాల్లో నటించి భారీ గుర్తింపు సంపాదించుకుంది. అంతే కాదు కమర్షియల్ సినిమాలతో పెరుగు లేని హీరోయిన్ అనిపించుకుంది కాజల్ అగర్వాల్. అలాంటి ఈ స్టార్ హీరోయిన్ పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు పుంజుకుంది. తన సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి మంచి అవకాశాలతో దూసుకుపోతోంది. అయితే 2020లో కాజల్ అగర్వాల్

 తన స్నేహితుడు గౌతం ను ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. వివాహం తరువాత కొత్త జంటగా వెకేషన్స్ కి వెళుతూ తమ పెళ్లి జీవితాన్ని బాగా ఎంజాయ్ చేసింది కాజల్. ఆ తర్వాత ఒక బాబుకి జన్మనిచ్చింది ప్రస్తుతం తల్లిగా కూడా తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. అదేవిధంగా గత ఏడాది నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంతుత్ కేసరి సినిమాతో మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది.  ఇక ఇటీవల విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ సత్యభామ

 సినిమా చేస్తోంది. త్వరలోనే ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ను శరవేగంగా చేస్తున్నారు. అయితే ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో సైతం చాలా చురుకుగా ఉంటుంది ఈ భామ. తనకి సంబంధించిన గ్లామరస్ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది .అదేవిధంగా ఇప్పుడు కాజల్ అగర్వాల్ ఒక ట్రెండీ వేర్ లో మెరిసింది. వాటికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కాజల్ అగర్వాల్ నటిస్తున్న సత్యభామ సినిమాలో ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతోంది. అంతేకాదు సెకండ్ ఇన్నింగ్స్ లో మొదటిసారిగా లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: