పోయి పోయి శర్వానంద్ ఆ డైరెక్టర్ కు ఓకే చెప్పాడేంటి.. షాక్ లో ఫ్యాన్స్?

praveen
హీరో శర్వానంద్ పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది. కుటుంబ కథా చిత్రాలు లేదంటే లవ్ ఎంటర్టైనింగ్ సినిమాలు. సరదాగా సాగిపోయే కాన్సెప్ట్ తో ఉండే మూవీసే ఎక్కువగా గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇక శర్వానంద్ కూడా తన ఇమేజ్ కు తగ్గట్లుగానే సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కూడా మనమే అనే టైటిల్ తో రాబోతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా జూన్ 7వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతుంది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రస్తుతం శర్వానంద్ బిజీ బిజీగా ఉన్నాడు. ఇలాంటి సమయంలోనే ఈ హీరో తదుపరి సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారిపోయింది. ఎప్పుడూ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు మాత్రమే తీసే శర్వానంద్ ఇక ఇప్పుడు తన జోనర్ దాటి ఒక క్రేజీ డైరెక్టర్ తో మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడట. ఆ డైరెక్టర్ ఎవరో కాదు సంపత్ నంది. సాధారణంగా సంపత్ నంది మూవీస్ అంటే చాలు మాస్ యాక్షన్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉంటాయి.

 అయితే సంపత్ నంది దర్శకత్వంలో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా గంజా శంకర్ అనే సినిమాను తెరకెక్కించాలని అనుకున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మించాలని అనుకున్న.. వివిధ అడ్డంకుల కారణంగా చివరికి ఈ సినిమా ఆగిపోయింది. దీంతో సంపత్ నంది మరో హీరో కోసం వెతుకుతూ ఉన్నాడు అని చెప్పాలి  ఈ క్రమంలోనే శర్వానంద్తో సంపత్ నంది కాంబినేషన్ సెట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విచిత్రమైన కాంబినేషన్ గురించి తెలిసి అభిమానులు కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి. ఎంతో సాఫ్ట్ గా యూత్ ఫుల్ చిత్రాలు చేసే శర్వానంద్ మరోవైపు పక్క మాస్ చిత్రాలు చేస్తే సంపత్ నంది కాంబినేషన్లో సినిమా రావడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. దీంతో శర్వానంద్ కోసం ఎలాంటి కథ రెడీ చేశారు అన్నది సర్వత్ర ఆసక్తి నెలకొంది. పీపుల్ మీడియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: