మహేష్ - జక్కన్న సినిమాలో.. ఆదిపురుష్ హనుమంతుడు?

praveen
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ ఎవరు అంటే ప్రతి ఒక్కరు కూడా రాజమౌళి పేరు చెబుతూ ఉంటారు. ఎందుకంటే అప్పటివరకు కేవలం టాలీవుడ్ లో మాత్రమే స్టార్ డైరెక్టర్గా కొనసాగిన రాజమౌళి.. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులందరికీ కూడా సుపరిచితుడుగా మారిపోయాడు రాజమౌళి. ఈ క్రమంలోనే రాజమౌళి దర్శకత్వంలో ఏదైనా సినిమా వస్తుందంటే చాలు కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 అయితే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో త్రిబుల్ ఆర్ సినిమా తీసి వరల్డ్ వైడ్ హిట్ అందుకున్న రాజమౌళి.. ఇక ఎప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా తీసేందుకు రెడీ అవుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మూవీపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి  అయితే మహేష్ బాబు లాంటి అందగాడిని అటు రాజమౌళి ఎలా చూపించబోతున్నాడు అన్నది కూడా మారిపోయింది. ఇక ఈ మూవీకి సంబంధించి ఏ చిన్న విషయం తెరమీదకి వచ్చిన అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పాలి.

 అయితే రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో ఏకంగా ఆదిపురుష్ మూవీలోని హనుమంతుడి పాత్రధారుడు నటించబోతున్నాడట. ఆది పురుష్ సినిమాలో హనుమంతుడు పాత్రలో నటించి ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు దేవదత్త నాగే జక్కన్న మూవీలో నటించబోతున్నట్లు సమాచారం. ఆయన రాజమౌళితో దిగిన ఒక ఫోటో ఇటీవలే వైరల్ గా మారిపోయింది.. ఇక ఈ ఫోటో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది అని చెప్పాలి.. అయితే ఈ మూవీలో విలక్షణ నటుడు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మహేష్ బాబును ఢీకొట్టే విలన్ పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: