మాజీ భర్తకు మెగా డాటర్ స్పెషల్ ఇన్విటేషన్.. హల్చల్ చేస్తున్న కార్డ్..!

lakhmi saranya
మెగా డాటర్ నిహారిక.. జొన్నలగడ్డ చైతన్య అనే యువకుడిని పెళ్లి చేసుకుని అనంతరం విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్లో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్ మెగా ఫ్యామిలీతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులు హాజరయ్యారు. కానీ ఈ కాపురం మూడేళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. చైతన్య తో విడాకులు తీసుకుని పుట్టింటికి చేరుకుంది నిహారిక. దీంతో ఈ బ్యూటీ పై విమర్శలు మొదలయ్యాయి. ఈమె ఇప్పటికీ కూడా ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. ఈమె తన సోషల్ మీడియాలా ఖాతాలలో ఎటువంటి పోస్ట్ షేర్ చేసిన వాటి కింద డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి.

ఇక తాజాగా ఓ కార్డ్ ను తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో షేర్ చేసింది ఈ బ్యూటీ. మిత్రులు, శత్రువులు, సక్సెస్, ఫెయిల్యూర్, పర్సనల్, ప్రొఫెషనల్.. ఇలా అన్నిటి గురించి మెన్షన్ చేసి కార్డ్ మంచి మెసేజ్ ఇస్తుంది. కాగా దీనిపై పలువురు ప్రేక్షకులు స్పందిస్తూ.. మాజీ భర్తకు స్పెషల్ ఇన్విటేషన్ పంపించింది.. అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రజెంట్ నిహారిక సినిమాల్లోకి మరోసారి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. చైతన్యతో పెళ్లికి ముందు వరకు ఎన్నో సినిమాల్లో నటించిన నిహారిక పెద్దగా గుర్తింపును సంపాదించుకోలేకపోయింది.

దీంతో ఇండస్ట్రీకి పూర్తిగా గుడ్ బాయ్ చెప్పి వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. కానీ ఆ వివాహ దాంపత్య జీవితం కూడా మూడునాళ్ళ ముచ్చటిగా మిగలడంతో.. మరోసారి ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయింది. ఇటీవల ఓ నిర్మాణ సంస్థను కూడా స్థాపించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా సినిమాల్లో కూడా నటించేందుకు ఏమే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. తాజాగా ఓ సినిమాని కూడా ప్రకటించింది. ప్రస్తుతం అయితే ఇండస్ట్రీలో నిహారిక పేరు ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇదే ఫామ్ లో నిహారిక రెండు సూపర్ హిట్లు తన ఖాతాలో వేసుకుంటే ఇక ఈమెకి తిరుగు ఉండదని చెప్పుకోవచ్చు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: