వావ్: మరో అరుదైన గౌరవం అందుకున్న మెగాస్టార్.. ఫ్యాన్స్ ఖుషి..!

Divya
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ సినిమాల విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా కోసం ఎలాంటి పాత్రలోనైనా నటించగలిగిన హీరోగా పేరు సంపాదించారు. ప్రస్తుతం విశ్వంభర అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో చాలామంది నటీనటులు నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి సమయంలోనే చిరంజీవికి ఒక అరుదైన గౌరవం లభించింది. సినిమా రంగంలో చిరంజీవి అందించిన సేవలను గుర్తించిన దుబాయ్ ప్రభుత్వం చిరంజీవికి గోల్డెన్ వీసాను అందించినట్లు తెలుస్తోంది.

ఈ వీసా తో దుబాయిలో 10 ఏళ్ల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా ఉండవచ్చు.. 2019 నుంచి వివిధ రంగాలలో పలు రకాల సేవలను అందించిన వారికి దుబాయ్ ప్రభుత్వం ఇలాంటి గోల్డెన్ వీసాను ఇచ్చి మరి సత్కరిస్తుందట  చిరంజీవి కంటే ముందుగానే ఆయన కుమారుడు కోడలు ఉపాసన రాంచరణ్ ఇద్దరు కూడా అందుకున్నారు.. అలాగే అల్లు అర్జున్ కూడా ఈ గౌరవాన్ని దక్కించుకోవడం జరిగింది. ఇప్పుడు తాజాగా చిరంజీవి కూడా ఈ జాబితాలో చేరడం జరిగింది. అయితే ఈ గోల్డెన్ వీసా ని ఇప్పటికే బాలీవుడ్ కోలీవుడ్ సాన్ డెలివరీ పరిశ్రమకు చెందిన చాలామంది సెలబ్రిటీలు కూడా తీసుకున్నారు.

ఈ గోల్డెన్ వీసా ఇవ్వడంతో మెగా అభిమానుల సైతం తెగ సంబరపడిపోతున్నారు. చిరంజీవి యొక్క గొప్ప మనసు చాటి చెప్పడానికి ఇదొక ఉదాహరణ అన్నట్లుగా కూడా తెలియజేస్తున్నారు అంతేకాకుండా నిన్నటి రోజున ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రభువుకు ఉచితంగా వైద్యం చేయించినట్లుగా ఒక లెటర్ వైరల్ గా మారింది. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు కూడా మరింత అభినందనలతో చిరంజీవిని ముంచేత్తుతున్నారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులు సైతం ఈ విషయాన్ని తెగ వైరల్ గా చేస్తున్నారు. ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగ్ను పూర్తి చేసి వచ్చే ఏడాది విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: