అఫీషియల్ : "లవ్ మీ" మూవీకి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ యువ నటుడు ఆశిష్ రెడ్డి కొంత కాలం క్రితం రౌడీ బాయ్స్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేదు. దానితో ఈ మూవీ చివరగా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత ఆశిష్ "సెల్ఫీస్" అనే మూవీ ని మొదలు పెట్టాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇక ఈయన సెల్ఫిష్ మూవీ షూటింగ్ ఆగిపోయిన వెంటనే లవ్ మీ అనే మూవీ షూటింగ్ ను స్టార్ట్ చేశాడు.
 

ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా కంప్లీట్ చేశారు. ఇలా నిన్న అనగా మే 25 వ తేదీన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేశారు. ఈ మూవీ విడుదలకు ముందు ఈ చిత్ర బృందం వారు విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం , ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందించడం ఇలా కొన్ని కారణాల వల్ల ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. అలా మంచి అంచనాల నడుమ నిన్న విడుదల అయిన ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ దక్కింది. అయినప్పటికీ ఈ సినిమాకి విడుదల అయిన మొదటి రోజు మంచి కలెక్షన్ లు వచ్చాయి.  

తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ లకి సంబంధించిన ప్రకటనను విడుదల చేశారు. ఈ మూవీ కి మొదటి రోజు బాక్స్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 4.5 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించగా అరుణ్ భీమవరపు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: