రిలేషన్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సీనియర్ నటి గౌతమి..!!

murali krishna
సినియర్ నటి గౌతమి.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌ లలో ఈమె కూడా ఒకరు. అయితే ఈమె మొదట డిజైనర్‌ గా చిత్ర పరిశ్రమలో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది.ఇక ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టస్టుగా, హీరోయిన్‌ గా పలు సినిమాల్లో అలరించి ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. అంతేకాకుండా.. ఇటు తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోస్‌ నటించి స్టార్‌ స్టేటస్‌ ను సంపాదించుకుంది. అయితే సినీ జీవితాన్ని అందంగా డిజైన్‌ చేసుకున్న గౌతమి.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకలను ఎదుర్కొంది. అయితే తాజాగా ఓ ఇంటర‍్వ్యూలో పాల్గొన్న గౌతమి రిలేషిన్‌షిప్‌ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..ప్రముఖ సినీయర్‌ నటి గౌతమి తన సినీ జీవితంలో స్టార్‌ స్టేటస్‌ ను సంపాదించుకున్నా.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొందో అందరికీ తెలిసిందే. కాగా, మొదట్లో ఈమె బిజినెస్‌మెన్‌ సందీప్‌ భాటియాను పెళ్లాడింది. ఇక వీరిద్దరికి కూతురు సుబ్బలక్ష్మి జన్మించింది. అయితే పాప ఏడాదికే గౌతమి తన భర్తకు విడాకులు ఇచ్చేసింది. ఆ తర్వాతి కాలంలో కమల్‌ హాసన్‌ తో ప్రేమలో పడింది. ఈ క్రమంలోనే చాలాకాలం వీరిద‍్దరూ సహజీవనం కూడా చేశారు. అలా కొంతకాలం గడిచిన వీరి ప్రేమాయణంలో ఏం జరిగిందో తెలియదు కానీ, 2016లో వీరిద్దరూ విడిపోయిన సంగతి తెలిసిదే. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గౌతమి రిలేషన్‌షిప్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఈ సందర్భంగా గౌతమి మాట్లాడుతూ.. నీ బలం నువ్వే.. ఎందుకంటే బాధేసినప్పుడు నచ్చిన వ్యక్తి వీడియోలు చూడటమో లేదా నీలో ధైర్యాన్ని నింపే వ్యక్తి మాటలు వినడమో చేస్తుంటాం. ఇలా ఒక్కొక్కరు ఒక్కో దారి అనుసరిస్తుంటారు. అలా ప్రతి ఒక్కరినీ ఏదో ఒక అంశం ఇన్‌స్పైర్‌ చేస్తూ.. దానికి అట్రాక్ట్‌ అవుతారు. కానీ నిజమైన బలం వేరెవరూ కాదు. నాకు నేను, నీకు నువ్వే అసలైన బలం. అంతేకాకుండా.. ఒక రిలేషన్‌షిప్‌ వర్కవుట్‌ కాలేదంటే దానికి పూర్తి బాధ్యత నీదేనని నీ నెత్తిన వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఏ రిలేషన్‌ అయినా సరే ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక కేంద్ర బిందువు ఉంటుంది. ఇక అక్కడ సమానంగా చేరుకోవాలి. అయితే కొన్ని కారణాల వల్ల కొందరు ఆ బిందువుకు దూరంగా ఉంటారు. పైగా మనకోసం చాలాదూరం వచ్చినట్లు ఫీలవుతారు.ఇలా ఒక్కసారి మోసం చేశారంటే.. మళ్లీ మళ్లీ మోసగిస్తూనే ఉంటారు. వారికి అదొక అలవాటుగా మారిపోతుంది. అప్పుడు నేనెందుకు నీకోసం అంత దూరం రావాలని మనల్నే తిరిగి ప్రశ్నిస్తారు. కావాలంటే నువ్వే వచ్చేయ్‌ అంటారు. ఇది నేను జీవితంలో నేర్చుకున్న ఓ గుణపాఠం. మనమెప్పుడూ ఆ బిందువును దాటి ముందుకు వెళ్లకూడదు. లవ్‌, కమిట్‌మెంట్‌ అనేది రెండువైపులా సమానంగా ఉండాలి. అప్పుడే ఆ బంధం ఎక్కువకాలం నిలుస్తుంది' అని గౌతమి చెప్పుకొచ్చింది. అయితే గౌతమి చేసిన వ్యాఖ్యాలు కమల్‌ ను ఉద్దేశించి చేసినవే అని నెట్టింట చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: