ఐ కాన్ స్టార్
అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ
మూవీ లో
టాలీవుడ్ టాప్
హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి
రష్మిక మందన
హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ఉన్న
డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి
సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి సంస్థ వారు ఎంతో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ
మూవీ కి రాక్ స్టార్ దేవి
శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ ఉండగా ... మలయాళ విలక్షణ నటుడు ఫాహధ్
ఫజిల్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నాడు.
అనసూయ ,
సునీల్ ,
రావు రమేష్ ఈ
మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాను ఆగస్టు 15 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పాన్
ఇండియా మూవీ గా తెలుగు ,
తమిళ ,
కన్నడ , మలయాళ ,
హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఇన్ని రోజుల పాటు సైలెంట్ గా ఉన్న ఈ
మూవీ బృందం వారు ప్రస్తుతం మాత్రం వరుస ప్రమోషన్ లతో ఫుల్
జోష్ లో దూసుకుపోతున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ
సినిమా టీజర్ ను మేకర్స్ విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది.
ఇక కొన్ని రోజుల క్రితమే ఈ
మూవీ ఫస్ట్ సింగిల్ ని కూడా మేకర్స్ విడుదల చేశారు. దానికి కూడా డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ రోజు ఈ సినిమాలోని సెకండ్ సింగల్ కి సంబంధించిన అప్డేట్ ను ప్రకటించారు. ఈ
మూవీ లోని రెండవ సింగిల్ అనౌన్స్మెంట్ వీడియోను రేపు ఉదయం 11 గంటల 07 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు ఈ
మూవీ బృందం వారు ఓ
పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ
పోస్టర్ వైరల్ అవుతుంది. ఈ
సినిమా లోని రెండవ పాట పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఈ సాంగ్ అందుకుంటుందో లేదో చూడాలి.