జాక్పాట్ అవకాశం కొట్టేసిన మృణాల్ ఠాకూర్.. ఆ బిగ్ ప్రాజెక్ట్ కి సైన్..!

lakhmi saranya
టాలీవుడ్ కి అడుగుపెట్టిన మొట్టమొదటి సినిమా తోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్స్లో మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు. టాలీవుడ్ సీతామహాలక్ష్మి గా గుర్తింపును సంపాదించుకుంది ఈ బ్యూటీ. సీత రామం చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి అనంతరం స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు కొట్టేసింది ఈ బ్యూటీ. ఇటీవలే హాయ్ నాన్న సినిమాలో హీరోయిన్ గా నటించి మరోసారి తన ఇమేజ్ను ప్రేక్షకులకు గుర్తు చేసింది మృణాల్.

ఇక తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీలో హీరోయిన్గా నటించిన... అపజయాన్ని వెలుగు చూసింది. ఇప్పటివరకు వర‌స విజయాలను సాధిస్తూ వచ్చిన ఈ బ్యూటీ ఖాతాలో ఒక అట్టర్ ఫ్లాప్ పడింది. దీంతో  ఇవే గ్రేస్ పెరిగినట్లే పెరిగి ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. ఇటువంటి సమయంలో ఈ బ్యూటీ ఓ భారీ ప్రాజెక్టుకు ఒకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

పాపులర్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీల భన్సాలి నిర్మాణంలో  తెరకెక్కుతున్న చిత్రానికి మామ్ ఫేమ్  దర్శకుడు డైరెక్షన్ వహిస్తున్నట్లు తెలుస్తుంది. డిఫరెంట్ రొమాంటిక్ స్టోరీ గారూ పొందుతున్న ఈ సినిమాలో సిద్ధాంత్ హీరోగా నటిస్తుండగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించబోతున్నట్లు సమాచారం. సంగీతం ప్రాధాన్యంగా రాబోతున్న ఈ మూవీ జూన్ నుంచి చిత్రీకరణ స్టార్ట్ చేయనున్నారట.... ఇక ఈ మూవీ తో కనుక ఈ బ్యూటీ సూపర్ హిట్ కొడితే మరోసారి ఫామ్ లోకి వస్తుందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ డిజాస్టర్ తో ఉన్న మృణాల్ ఠాకూర్ నీ సక్సెస్ ట్రాక్ లోకి తీసుకొస్తుందో లేదో చూడాలి.ఇక ఈ మూవీలో ఈ బ్యూటీ పాత్ర గురించి మరికొన్ని రోజుల్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ న్యూస్ విన్నా మృణాల్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.ఇక ప్రజెంట్ ఇదే న్యూస్ కోలీవుడ్ ఇండస్ట్రీలో హల్చల్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: