మాస్క్ ధరించి రోడ్డుపై సింపుల్గా షికారు చేస్తున్న స్టార్ హీరోయిన్.. ఫొటోస్..!

lakhmi saranya
సినీ ఇండస్ట్రీకి చెందిన తారలు రోడ్లపై అలా కనిపిస్తే చాలు ఇలా వీడియోలు మరియు ఫోటోలను తీయడం మొదలు పెడతారు జనాలు. దీంతో సెలబ్రిటీలు బయటకు వచ్చేటప్పుడు తమ ఫేస్ని ఎంతో జాగ్రత్తగా కవర్ చేసుకుంటూ ఉంటారు. ఇక అలా కవర్ చేసుకున్నప్పటికీ కొందరిని ప్రేక్షకులు ఇట్టే కనిపెట్టేస్తారు. ఇక ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూడా ప్రేక్షకుల కంటికి కనిపించేసింది.

క్యాప్ ధరించి అంతా కవర్ చేసుకొని చాలా నార్మల్ గా రోడ్లపై తిరిగింది. మరి ఆ బ్యూటీ మరెవ్వరో కాదు మన నేషనల్ క్రష్ రష్మిక. చలో చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అనంతరం తన అంద చందాలతో నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకుంది. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ ని సంపాదించుకుంది ఈ బ్యూటీ. ప్రెసెంట్ పుష్ప 2 మూవీ షూటింగ్లో బిజీగా ఉంది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చింది.

ముఖానికి మాస్క్ ధరించి నల్లటి కళ్లద్దాలు పెట్టుకుని.. ఫేస్ ని మొత్తం కవర్ చేసేందుకు హెడ్ కి క్యాప్ ని ధరించింది ఈ నేషనల్ క్రష్. ఈ లుక్ లో చాలా స్టైలిష్ గా కనిపించిన రష్మికను ప్రేక్షకులు గుర్తుపట్టి ఫోటోలు తీయడం మొదలుపెట్టారు. అలా తీసిన ఫోటోలను మరియు వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోస్ అండ్ వీడియోస్ చక్కర్లు కొడుతున్నాయి. అలా ఎవరికి అనుమానం రాకుండా రోడ్లపై షికారు చేద్దాం అనుకున్న రష్మిక ప్లాన్లు మొత్తం మంట కలిసిపోయాయి.ఇక ప్రజెంట్ ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఏదో చేద్దామని ఇంకేదో చేశావు ఏంటి రష్మిక? మొత్తానికి కమెడియన్ అయిపోయావుగా. నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకుని ఇంత చిన్న పనితో దొరికిపోతావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: