ఏ రంగంలో అయినా ఒకరు మనకు మంచి చేశారు అంటే తిరిగి వారికి మంచి చేసే మనస్వతం కలిగిన మనసులు ఎంతోమంది ఉంటారు. అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా అలాంటి వ్యక్తిత్వం కలిగిన మనుషులు ఎంతోమంది ఉన్నారు. ఉదాహరణకు ఒక సంఘటన గురించి తెలుసుకుందాం... అల్లు అర్జున్ "గంగోత్రి" సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. కానీ ఆయనకు ఆ సినిమా అంతగా సంతృప్తిని ఇవ్వలేదు. అలాంటి సమయంలోనే ఒక స్టైలిష్ ఎంటర్టైనర్ మూవీలో నటించాలి అని అల్లు అర్జున్ ఫిక్స్ అయ్యాడు.
అందుకోసం అనేక కథలను విన్నాడు. కానీ ఏ కథ కూడా ఆయనకు నచ్చలేదు. అలాంటి సమయంలోనే భద్ర మూవీ కథను అల్లు అర్జున్ ఉన్నాడు. సినిమా కథ సూపర్ గా ఉంది. దాన్ని చేయాలి అని అనుకున్నాడు. కానీ అదే సమయంలో దిల్ రాజు ... సుకుమార్ దర్శకత్వంలో ఆర్య సినిమా చేయడం కోసం హీరోని వెతుకుతున్నాడు. ఇక అలాంటి సమయంలోనే ఒక రోజు దిల్ మూవీ ని కొంత మంది సెలబ్రిటీలకి దిల్ రాజు చూస్తున్న సమయంలో ఆ ప్రదేశానికి అల్లు అర్జున్ కూడా వచ్చి సినిమా చూస్తున్నాడట.
ఇక ఆ సమయంలో సుకుమార్ కి ఆర్య కథకి ఈయన పర్ఫెక్ట్ అని అనిపించిందట. ఆ వెంటనే కూర్చొని బున్ని కి ఆ కథను వినిపించడం , ఆయనకు ఇది సూపర్ గా నచ్చడం జరిగిందట. ఇక ఆ తర్వాత కొన్ని సెట్టింగ్స్ తర్వాత కంప్లీట్ గా సినిమాను ఓకే చేసుకున్నారు. ఇక ఈ సినిమా ఓకే అయిన తర్వాత బన్నీ , దిల్ రాజు తో... సార్ నేను బోయపాటి శ్రీను అనే వ్యక్తి దగ్గర ఒక కథను విన్నాను. అది సూపర్ గా ఉంది. ఒక సారి మీరు కూడా ఆ కథను వినండి. నచ్చితే సినిమా చేయండి బాగుంటుంది అని అన్నాడంట.
ఆ వెంటనే దిల్ రాజు ఆ కథను వినడం , అది సూపర్ గా అనిపించడంతో రవితేజ ను హీరోగా సెలెక్ట్ చేసుకొని సినిమా చేసి బ్లాక్ బాస్టర్ హిట్టు కొట్టడం జరిగిపోయింది. ఇక బన్నీ కి భద్ర మూవీ కథ అంతగా నచ్చింది. ఆయన నాన్నగారు ఒక నిర్మాత. ఆ బ్యానర్ లోనే భద్ర సినిమాలు చేయకుండా దిల్ రాజు కు అప్పగించాడు. ఆర్య లాంటి కథను తనకు ఇచ్చినందుకు అంత త్వరగా దిల్ రాజు రుణం అల్లు అర్జున్ తీర్చుకున్నాడు.