అమెజాన్ ప్రైమ్ లో హల్చల్ చేస్తున్న షారుఖ్ ఖాన్ "రబ్ నే బనా దీ జోడి "..!!
ఆమె డల్ గా ఉండడం చూసి ఒకరోజు ఆమె ఇష్టాలను తెలుసుకుని ఆమెను డ్యాన్స్ క్లాస్ లో చేర్పిస్తాడు సురేందర్. ఆమెకు డ్యాన్స్ అంటే ఇష్టం. అక్కడ రాజ్ అనే వ్యక్తి పరిచయం అవుతాడు. ఆ వ్యక్తితో ప్రేమలో పడిపోతుంది. కానీ పెళ్లి అయిపోయింది. తనలో తానే దీన్ని ఎలా ఫేస్ చేయాలా అని మదనపడుతుంటుంది తానీ. ఇన్నోసెంట్ భర్తతో ఉండాలా? లేక ఇంటిలిజెంట్ ప్రియుడితో వెళ్లిపోవాలా? ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. ఆ ఇంటిలిజెంట్ ప్రియుడు మరెవరో ఆమె భర్తే. మారువేషంలో ఆమె కోసం, ఆమె ప్రేమ కోసం ఒక్కడే ఆమెకు తెలియకుండా ఇద్దరిలా నటిస్తాడు. భర్తగా ఆమెకు ఇవ్వలేని ప్రేమను ఒక ప్రియుడిగా ఆమెకు ఇస్తాడు. కానీ చివరకు ఆమెకు ఈ విషయం తెలిసిపోతుంది. ఆమె ఎవరిని కోరుకుంటుంది? భర్తనా? లేక మారువేషంలో ఉన్న ప్రియుడినా? ఈ కథలో భార్య ప్రేమ కోసం ప్రియుడిగా మారిన భర్త క్యూట్ లవ్ స్టోరీ ఉంది. భర్త ఉండగా పరాయి మగాడితో ప్రేమ ఏంటి అని తనలో తాను సంఘర్షణకు గురయ్యే ఒక ఇల్లాలి కథ ఉంది. అన్నిటికంటే మించి భర్త అంటే ఇష్టం లేని భార్యను అర్థం చేసుకుని.. ఆమె మనసులో చోటు ఎలా దక్కించుకోవాలో అన్న ఒక ఆకస్తికర అంశం ఉంది. ఇందులో ఎమోషన్స్ కి కొదవ లేదు. అమ్మాయిలు హీరోలని ఇష్టపడతారు కదా.. భర్త హీరోలా ఉండాలని అనుకుంటారు కదా. ఒక సీన్ లో సురేందర్ తానీ గుప్తా ముందు హీరో అనిపించుకోవడం కోసం ఒక భారీ మనిషిని ఢీ కొంటాడు. ఈ క్రమంలో దెబ్బలు తింటాడు. గుండెలు పిండేసే సీన్ అది. ఇదొక్కటే కాదు చాలా సీన్లు గుండెలను పిండేసి శరీరాన్ని కన్నీటితో తడిపేస్తాయి. అంత బాగుంటుంది ఈ సినిమా.
ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఆ పాటలు నిజంగా భర్యాభర్తల ప్రేమకు ప్రతీకగా నిలుస్తాయి. ఇన్నోసెంట్ భర్తగా షారుక్ ఖాన్, పెళ్లంటే ఇష్టం లేని అమ్మాయిగా అనుష్క శర్మ చాలా అద్భుతంగా నటించారు. కొత్తగా పెళ్ళైన వారికి ఈ సినిమా నచ్చుతుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న అమ్మాయిలు, అమ్మాయికి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్న అబ్బాయిలు కలిసి చూడాల్సిన సినిమా. ఒక మంచి సినిమా చూశామన్న అనుభూతి అయితే కలుగుతుంది. వందకు వంద శాతం గ్యారంటీ. ఆ సినిమా పేరు 'రబ్ నే బనా దీ జోడి'. అమెజాన్ ప్రైమ్ లో ఉంది. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి.