ఆ తేదీన "ప్రేమికుడు" రీ రిలీజ్..!

Pulgam Srinivas
ప్రభుదేవా హీరోగా నగ్మా హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో ప్రేమికుడు అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ 1994 వ సంవత్సరం సెప్టెంబర్ 17 వ తేదీన భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ మూవీ అటు తమిళ్ లోను , ఇటు తెలుగు లోను కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ద్వారా ఈ సినిమాలో హీరో గా నటించిన ప్రభు దేవ కు అలాగే ఇందులో హీరోయిన్ గా నటించిన నగ్మా కు ఈ మూవీ కి దర్శకత్వం వహించిన శంకర్ కి సూపర్ సాలిడ్ క్రేజ్ లభించింది.

ఇకపోతే ఈ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా ... వడివేలు , రఘువరన్ , ఎస్పీ బాలసుబ్రమణ్యం ఈ మూవీ లో ముఖ్య పాత్రలో నటించారు. ఇకపోతే 1994 వ సంవత్సరం విడుదల అయ్యి ఆ సమయంలో అద్భుతమైన విజయం అందుకున్న ఈ మూవీ ని తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీస్ చేయబోతున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ ని మే 1 వ తేదీన 300 కు పైగా థియేటర్ లలో రీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈమధ్య కాలంలో రీ రిలీస్ ల ట్రెండు జోరుగా సాగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. రీ రిలీజ్ అయిన కొన్ని సినిమాలు అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలక్షన్ లను వసూలు చేస్తున్నాయి. మరి ప్రేమికుడు సినిమా రీ రిలీజ్ లో భాగంగా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో ... ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: