మంకీ మ్యాన్: ఇండియాలో చిక్కులు తప్పట్లేదుగా?

Purushottham Vinay
స్లం డాగ్ మిలియనీర్ హీరో దేవ్ పటేల్ తెరకెక్కించిన హాలీవుడ్ మూవీ 'మంకీ మ్యాన్' గ్రాండ్ హిట్ ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. విమర్శకుల ప్రశంసలతో ఈ మూవీ దిగ్విజయంగా దూసుకుపోతుంది.మంచి కంటెంట్ కి ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్న విషయం మళ్ళీ ప్రూవ్ అయ్యింది.  ప్రస్తుతం విదేశాల్లో 'మంకీ మ్యాన్' సినిమా ఎంతగానో సత్తా చాటుతుంది. అయితే ఇండియాలో మాత్రం ఇంకా రిలీజ్ కాలేదు. రిలీజ్ కి సెన్సార్ అడ్డంకులు ఉండటంతో మనోభావాలు దెబ్బ తీస్తాయని కత్తిరింపులు వేసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. అయితే ఇది కేవలం యుఎస్ ఇంకా యుకె తదితర దేశాల ఆడియన్స్ కి మాత్రమే అందుబాటులోకి వచ్చింది. అయితే అందరూ చూడటానికి వీలు లేదు. ప్రైమ్..యాపిల్ లాంటి మాధ్యమాల ద్వారా రెంట్ పే చేసి చూసే ఆప్షన్ ఈ సినిమాకి ఉంది.సినిమాకి సెన్సార్ చిక్కులున్నాయి కాబట్టి అసౌకర్యానికి గురికాక తప్పదు. అయినా భారతీయులు ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి ఏదోలా చూసే ప్రయత్నం జరుగుతుంది. రిలీజ్ కాకుండానే ఇండియాలో ఈ సినిమా పైరసీ అయిపోతుంది.ఈ 'మంకీ మ్యాన్' పైరసీకి ఎక్కువ అవకాశం ఉంది.


 కాబట్టి నిర్మాతలు ఈ సినిమాని ఎంత వీలైంత అంత త్వరగా ఇండియాలో రిలీజ్ చేయాలి. లేకపోతే విడుదల చేసే  ఆలోచనే విరమించుకోవాలి. లేదంటే ఈ లోపు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది. మరి ఇన్ని అడ్డంకుల్ని తొలగించికుని మంకీ మ్యాన్ అధికారికంగా ఇండియన్ ప్రేక్షకుల ముందుకొస్తుందా? రాదా? అన్నది చూడాలి.ఈ దర్శకుడు దేవ్ పటేల్ కి చాలా మంచి మంచి పేరొస్తుంది. ఇక స్లమ్ డాగ్ మిలీయనీర్ మూవీతో తో దేవ్ పటేల్ బాల నటుడిగా తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఫిదా ప్రింటో హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ ముఖ్య పాత్ర పోషించాడు. ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేసినందుకు గాను ఏ ఆర్ రెహమాన్ కూడా రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్నాడు. అలా ఈ సినిమాతో వరల్డ్ అంతా ఫేమస్ అయ్యాడు దేవ్ పటేల్. పైగా ఆ సినిమాకి అప్పట్లో ఆస్కార్ అవార్డులు వరించడంతోనే అది సాధ్యమైంది. తాజాగా మంకీ మ్యాన్ మూవీతో మరోసారి ప్రపంచ వ్యాప్తంగా నీరాజనాలు అందుకుంటున్నాడు దేవ్ పటేల్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: