విజయ్ తో మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన వెట్రి మారన్..!

MADDIBOINA AJAY KUMAR
తమిళ సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో వెట్రీ మారన్ ఒకరు. ఈయన కమర్షియల్ సినిమాలతో కాకుండా వైవిధ్యమైన సినిమాలతో ఎన్నో విజయాలను అందుకొని తమిళ సినీ పరిశ్రమలో మాత్రమే కాకుండా ఇండియా వ్యాప్తంగా దర్శకుడిగా తనకంటూ ఒక మంచి స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఇకపోతే ఈ దర్శకుడు కొంతకాలం క్రితమే విడుదలై పార్ట్ 1 అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో కమీడియన్ సూరి ప్రధాన పాత్రలో నటించగా ... విజయ్ సేతుపతి ఓ కిలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ తెలుగు లో విడుదల పార్ట్ 1 అనే పేరుతో విడుదల అయ్యింది.

ఇకపోతే ఈ సినిమా అటు తమిళ్ లోను , ఇటు తెలుగులోనూ అద్భుతమైన విజయం సాధించింది. వెట్రీ మారన్ ప్రస్తుతం విడుదలై పార్ట్ 1 కి కొనసాగింపుగా విడుదలై పార్ట్ 2 అనే మూవీ ని తనకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా తర్వాత సూర్యతో ఓ మూవీ చేయడానికి ఇప్పటికే ఈ దర్శకుడు కమిట్ అయ్యాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఈయనకు మీరు తలపతి విజయ్ తో సినిమా చేసే అవకాశం ఉందా అని ప్రశ్న ఎదురైంది.

దీనికి వెట్రీ మారన్ సమాధానం ఇస్తూ ... తలపతి విజయ్ తో సినిమా చేయాలని నాకు కూడా ఉంది. ఆయనతో సినిమా చేసేందుకు తగిన కథ కూడా ప్రస్తుతం నా దగ్గర ఉంది. కాకపోతే ప్రస్తుతం నేను ఒక సినిమా చేస్తున్నాను. మరి కొన్ని సినిమాలకు కమిట్ అయి ఉన్నాను. ఆ మూవీ ల తర్వాత విజయ్ తో మూవీ చేసే ఛాన్స్ ఉంది. కానీ దాని గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను అని ఈయన చెప్పుకొచ్చాడు. ఇక విజయ్ ప్రస్తుతం గోట్ లో హీరోగా నటిస్తున్నాడు. ఆ తర్వాత డివివి దానయ్య బ్యానర్ లో ఓ మూవీ చేయబోతున్నాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దానితో ఈయన సినిమాలు చేసే అవకాశం లేనట్లే తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vm

సంబంధిత వార్తలు: