ఆకట్టుకుంటున్న 'ఇంద్రాణి' మూవీ సాంగ్‌ "నేనే రావణ"

Chakravarthi Kalyan
శ్రేయ్ మోషన్ పిక్చర్స్, స్టీఫెన్ పల్లం నుంచి వస్తున్న 'ఇంద్రాణి' సినిమా నుంచి తాజాగా నేనే రావణ పాట విడుదలైంది. యానీయా, అంకిత, అజయ్ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న చిత్రం ఇంద్రాణి - ఎపిక్ 1: ధరమ్ vs కరమ్. స్టీఫెన్ పల్లం స్వీయ దర్శక నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతోంది. శ్రేయ్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ ఇంద్రాణి - ఎపిక్ 1: ధరమ్ vs కరమ్ చిత్రానికి కేకే రెడ్డి కాగా.. సుధీర్ వేల్పుల, జే సేన్ సహా నిర్మాతలు.

సాయికార్తీక్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి నేనే రావణ అనే పవర్ ఫుల్ పాట విడుదలై ఆకట్టుకుంటోంది. స్పెషల్‌గా కనిపిస్తోంది. అర్జున్ కౌండిన్య, రోల్ రైడా కలసి ఈ పాట పాడారు. ఈ పాటకు రోల్ రైడా అందించిన లిరిక్స్ స్పెషల్ ఎట్రాక్షన్. అనీష్ మాస్టర్ కొరియోగ్రఫీ చాలా డిఫరెంట్ గా వుందనే టాక్‌ వస్తోంది. వినగానే హత్తుకునే ఈ పాట చార్ట్ బస్టర్ గా నిలుస్తోంది.  ఇక ఈ చిత్రం తారాగణం విషయానికి వస్తే.. కబీర్ సింగ్, షతాఫ్ ఫిగర్, సప్తగిరి, ఫ్రనయిత, గరిమా, సునయిన లవి కీలక పాత్రలు. ఈ సినిమాను మే 24 ,2024 న  విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. వినూత్న కథాంశంతో వస్తున్న ఈ చిత్రం తప్పుకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిర్మాతలు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు.

టెక్నికల్ టీం:
రచన, దర్శకత్వం, నిర్మాణం & VFX పర్యవేక్షణ: స్టీఫెన్ పల్లం
సహ నిర్మాతలు: కేకే రెడ్డి, సుధీర్ వేల్పుల, జే సేన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: స్టాన్లీ పల్లం
సంగీతం: సాయి కార్తీక్
ఎడిటర్: రవి తేజ కుర్మాణ
కొరియో గ్రాఫర్: అనీష్ మాస్టర్
డీవోపీ : చరణ్ మాధవనేని
ఆర్ట్ డైరెక్టర్: రవి కుమార్ గుర్రం
యాక్షన్: ప్రేమ్ సన్
సౌండ్ ఎఫెక్ట్స్: జి.పురుషోత్తం రాజు
పీఆర్వో: తేజస్వి సజ్జా

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: