అఫీషియల్ : "ఎన్బికె 109" లో ఆ బాలీవుడ్ నటుడు..!

MADDIBOINA AJAY KUMAR
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ కి ఇప్పటివరకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 109 వ సినిమాగా రూపొందుతూ ఉండడంతో ఈ మూవీ ని "ఎన్ బి కె 109" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తూ వస్తుంది.
 

కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుండి ఒక వీడియోను విడుదల ఈ మూవీ యూనిట్ చేయగా అది అద్భుతమైన రేంజ్ లో ఉండడం, అందులో బాలయ్య తన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ వీడియో తోనే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇకపోతే గత కొంత కాలంగా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అయినటువంటి బాబి డియోల్  ఓ కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతున్న విషయం మనకు తెలిసిందే.

ఇకపోతే తాజాగా ఈ మూవీ యూనిట్ ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ దర్శకుడు బాబి అలాగే ఈ సినిమాను నిర్మిస్తున్న సూర్య దేవర నాగ వంశీ , బాబి డియోల్ ముగ్గురు కలిసి ఉన్న ఒక ఫోటోను ఈ చిత్ర బృందం వారు బయటకు వదిలారు. దీనితో ఈ మూవీ లో బాబీ  డియోల్ నటిస్తున్నట్లు తెలిసిపోయింది. మరి ఈయన ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నాడా..? లేక మరేదైనా ఇతర పాత్రలో నటిస్తున్నాడా అనేది తెలియాలి అంటే.చిత్ర బృందం క్లారిటీ ఇచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ఈ మూవీ లో బాలయ్య సరసన ఇద్దరూ బ్యూటీలు కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఊర్వశి రౌటేలా ను ఇప్పటికే ఇందులో ఒక హీరోయిన్ గా కన్ఫామ్ అయినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. మరి ఇంకో హీరోయిన్ గా ఎవరిని ఈ మూవీ యూనిట్ సెలెక్ట్ చేస్తుందో చూడాలి. ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తూ ఉండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: