"ఈగల్" మూవీకి ఎన్ని కోట్ల నష్టం వచ్చిందో తెలుసా..?

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో అనుపమ పరమేశ్వరన్ , కావ్య దాపరర్ హీరోయిన్ లుగా రూపొందిన ఈగల్ సినిమా ఫిబ్రవరి 9 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే టైటిల్ బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. అందులో భాగంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి ఎన్ని కోట్ల నష్టం వచ్చింది అనే విషయాన్ని తెలుసుకుందాం.

టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 4.95 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... సీడెడ్ ఏరియాలో 2.07 కోట్లు ... ఉత్త రాంధ్రలో 1.96 కోట్లు , ఈస్ట్ లో 1.26 కోట్లు , వెస్ట్ లో 78 లక్షలు , గుంటూరు లో 1.22 కోట్లు , కృష్ణ లో 61 లక్షలు , నెల్లూరు లో 58 లక్షల కలెక్షన్ లు దక్కాయి. టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ పూర్తి అయ్యే సరికి ఈగల్ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 13.71 కోట్ల షేర్ ... 25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే ఈ సినిమా టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 1.58 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... ఓవర్ సీస్ లో 1.60 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 16.89 కోట్ల షేర్ ... 32 కోట్ల క్లాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 21 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇక ఈ సినిమా కేవలం 77 శాతం కలెక్షన్ మాత్రమే రికవరీ చేసి 5.11 కోట్ల నష్టాలను అందుకొని యావరేజ్ విజయాన్ని సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: