"ఓటిటి" రైట్స్ తో రికార్డ్ సృష్టించిన "పుష్ప 2"..?

MADDIBOINA AJAY KUMAR
డిసెంబర్ 2021 వ సంవత్సరం భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన "పుష్ప పార్ట్ 1" మూవీ ఏ స్థాయి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించగా రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఫాహాధ్ ఫేజిల్ ఈ మూవీలో ప్రతి నాయకుడి పాత్రలో నటించగా ... అనసూయ , సునీల్ , రావు రమేష్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు.

సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ... మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మించారు. సమంత ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో నటించింది. ఇక ఈ మూవీలోని నటనకు గాను అల్లు అర్జున్ కు ఏకంగా నేషనల్ అవార్డు కూడా దక్కింది. ఈ మూవీ మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో ఈ సినిమా రెండవ భాగంపై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఈ సినిమాకు అదే స్థాయిలో బిజినెస్ కూడా జరుగుతూ వస్తుంది. అందులో భాగంగా ఈ మూవీకి అదిరిపోయే రేంజ్ ఓటిటి డీల్ కుదిరినట్లు ఇది ఇండియాలోనే టాప్ డీల్ గా తెలుస్తుంది. ఈ సినిమా యొక్క డిజిటల్ రైట్స్ కోసం అనేక సంస్థలు పోటీ పడగా వాటిని నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకున్నట్లు ... ఈ సంస్థ ఏకంగా 275 కోట్ల భారీ వ్యయంతో ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత ఆర్ఆర్ఆర్ 170 కోట్ల డిజిటల్ రైట్స్ తో సెకండ్ ప్లేస్ లో ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa

సంబంధిత వార్తలు: