"గిల్లి" రీ రిలీజ్... బుక్ మై షో లో సూపర్ రెస్పాన్స్..!

Pulgam Srinivas
తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ కొన్ని సంవత్సరాల క్రితం గిల్లి అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని త్రిష హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తెలుగు లో సూపర్ సక్సెస్ అయినటువంటి ఒక్కడు మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందింది. ఒక్కడు మూవీ సూపర్ సక్సెస్ కావడం ఆ మూవీకి అధికారిక రీమేక్ గా ఈ మూవీ రూపొందడంతో మొదటి నుండే ఈ సినిమాపై తమిళ ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ ని ఈ సంవత్సరం 20 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన టికెట్ లను ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఆన్లైన్ లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక ఈ సినిమాకి ఇప్పటి వరకు బుక్ మై షో లో రోజు వారిగా ఏ స్థాయిలో టికెట్ లు అమ్ముడుపోయాయి అనే విషయాన్ని తెలుసుకుందాం.

ఏప్రిల్ 15 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 7.71 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.

ఏప్రిల్ 16 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 9.21 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.

ఏప్రిల్ 17 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 17.18 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.

ఏప్రిల్ 18 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 21.42 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.

ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 55.52 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: