ఆరోజు ఏకంగా ఎన్టీఆర్ మూవీల నుండి మూడు అప్డేట్లు..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు . కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండగా ... జాన్వీ కపూర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది . ఈ సినిమా తోనే ఈ బ్యూటీ తెలుగు తెరకు పరిచయం కానుంది. ఈ సినిమా మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుంది . అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నారు . ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉండగానే ఎన్టీఆర్ బాలీవుడ్ సినిమా "వార్ 2" కూడా నటిస్తున్నాడు.

ఇందులో హృతిక్ రోషన్ తో పాటు ఎన్టీఆర్ స్క్రీన్ ను షేర్ చేసుకోబోతున్నాడు. ఇందులో కియర అద్వానీ హీరోయిన్ గా కనిపించబోతుంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ మొట్ట మొదటి సారి స్టేట్ హిందీ సినిమాలో కనిపించబోతున్నాడు. ఇకపోతే ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది.

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న , నటించబోయే మొత్తం ఈ మూడు సినిమాలకు సంబంధించిన అప్డేట్ లను మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... మే 20 వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూడు మూవీ బృందాలు కూడా ఈ సినిమాలకు సంబంధించిన కొన్ని అప్డేట్ లను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇలా ఎన్టీఆర్ మూ వీలకు సంబంధించిన మూడు అప్డేట్ లను మే 20 వ తేదీన విడుదల కాబోతున్నాయి అనే వార్త వైరల్ అవుతూ ఉండడంతో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: