కల్కి 2898 ఏడీ: విడుదలకు ముందే సాలిడ్ రికార్డ్స్?

Purushottham Vinay
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో కల్కి 2898 ఏడీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు బిజినెస్ కూడా భారీ రేంజ్ లో జరుగుతోంది.కల్కి 2898 ఏడీ ఆంధ్ర, తెలంగాణ హక్కులు ఏకంగా 190 కోట్ల రూపాయల దాకా అమ్ముడవుతున్నాయని సమాచారం తెలుస్తుంది. ఖచ్చితంగా ఇది ఒక సూపర్ రికార్డ్ అనే చెప్పాలి. కల్కి మూవీతో ప్రభాస్ కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ కామెంట్స్ చేసుండగా ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.కల్కి 2898 ఏడీ సినిమా బాహుబలి2  రేంజ్ సినిమా అని ఈ సినిమాకు ఎక్కువ మొత్తం ఖర్చు అయినా కలెక్షన్లు మాత్రం భారీ రేంజ్ లో ఉండబోతున్నాయని ప్రభాస్ అభిమానులు భావిస్తున్నారు. కల్కి 2898 ఏడీ సినిమా నుంచి ట్రైలర్ లేదా మరికొన్ని అప్ డేట్స్ వస్తే ఈ మూవీపై ఆకాశమే హద్దుగా అనే రేంజ్ లో అంచనాలు భారీగా పెరుగుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఈ కల్కి 2898 ఏడీ సినిమా ఖచ్చితంగా 2024 బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని ప్రభాస్ ఫ్యాన్స్ మేకర్స్ నుంచి బెస్ట్ ఔట్ ఫుట్ ఆశిస్తున్నారు.


ఈ సంవత్సరం సెకండాఫ్ లో ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదలవుతుండగా ఆ మూవీలలో ప్రతి సినిమా బడ్జెట్ పరంగా, క్వాలిటీ పరంగా టాప్ రేంజ్ లో ఉన్నాయి. అయితే టాప్ రేంజ్ లో ఉన్న ఈ సినిమాలు  బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో హిట్ గా నిలుస్తాయో చూడాల్సి ఉంది. కల్కి 2898 ఏడీ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ ను అంచనాలను మించి మెప్పిస్తుందని అనేక రకాల కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో నటిస్తున్న దీపిక పడుకునే ఈ సినిమా తర్వాత  తెలుగులో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.సరైన రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుని రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారని సమాచారం అందుతోంది.వైజయంతీ మూవీస్ బ్యానర్ కు భారీ హిట్ అవసరం కాగా కల్కి సినిమాతో ఆ హిట్ దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ కు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. కల్కి 2898 ఏడీ సినిమాలో ట్విస్టులు సైతం వేరే లెవెల్ లో ఉంటాయని సమాచారం అందుతోంది. ఈ సినిమాని మాక్సిమం మే 10 కి రిలీజ్ చెయ్యాలని అనుకున్నారు. ఇప్పుడు అదే అనుకుంటున్నారు. ఒకవేళ ఈ సినిమా ఆ డేట్ కి రాకుండా వాయిదా పడితే షర్వానంద్ మనమే సినిమా ఆ తేదీని లాక్ చేసుకోనుందని సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: