కార్నర్ అవుతున్న కల్కి !

Seetha Sailaja
ఈసంవత్సరం సమ్మర్ రేస్ కు విడుదలై రికార్డులు క్రియేట్ చేస్తుంది అని అంచనాలు ఏర్పరుచుకున్న ‘కల్కి 2898’ వాస్తవానికి మే 9న విడుదల కావలసి ఉంది. అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో ఆలస్యం జరగడంతో పాటు మే 13న తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల తేదీ కావడంతో ఈమూవీ విడుదలను వాయిదా వేశారు. ఇప్పుడు అసలైన సమస్య ఇక్కడే మొదలైంది అన్న మాటలు వినిపిస్తున్నాయి.

ఈమూవీని ఏనెలలో ఎప్పుడు విడుదల చేయాలి అన్న విషయం పై ఎన్ని సార్లు ఆలోచనలు జరిగినప్పటికీ జరిగినప్పటికీ డానికి సరైన పరిష్కారాలు లభించడం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మే 30 లేదంటే జూన్ 20 తేదీలు ఈసినిమా విడుదలకు అనువుగా ఉంటుంది అన్న ఆలోచనలు వచ్చినప్పటికీ ఆవిషయమై కూడ ఒక స్థిర నిర్ణయం తీసుకోలేకపోతున్నారని వార్తలు వస్తున్నాయి.

అయితే శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ నటిస్తున్న ‘ఇండియన్ 2’ మూవీ జూన్ 13న విడుదల కాబోతున్న పరిస్థితులలో ఈమూవీని ‘ఇండియన్ 2’ మూవీ కన్నా ముందుగా విడుదల చేస్తే మంచిది అన్న అభిప్రాయంలో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆసమయానికి తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు అయినప్పటికీ ఈ మూవీని అత్యంత భారీ రేట్లకు బయ్యర్లకు అమ్ముతున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడకుండా ఇప్పుడున్న ఆపద్ధర్మ ప్రభుత్వం ఎంతవరకు టిక్కెట్ల రేట్ల పెంపుకు సహకరిస్తుంది అన్న సందేహాలు కూడ ఈ మూవీ నిర్మాతలకు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈమూవీ నిర్మాత అశ్వనీ దత్ తెలుగు దేశ పార్టీకి సన్నీహితుడు అన్న ప్రచారం ఉన్న నేపధ్యంలో ప్రస్థుతం కొనసాగుతున్న ఎన్నికల వేడి ఈమూవీ టిక్కెట్ల రేట్ల పెంపు విషయంలో కొంతవరకు అడ్డంకిగా మారినా ఆశ్చర్యం లేదు అంటూ మరికొందరు ఊహాగానాలు చేస్తున్నారు. పూర్తిగా ఎన్నికల వాతావరణం చల్లబడ్డాక ఈమూవీని జూలైలో విడుదల చేద్దాం అనుకుంటే అప్పటికి సమ్మర్ సెలవులు అయిపోతాయి కదా  అన్న ప్రశ్నలు ఈమూవీ నిర్మాతలను వెంటాడుతున్నట్లుటాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: