రన్వీర్ సింగ్ తో నటించిన సమంత..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఏం మాయ చేసావే అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే సూపర్ సక్సెస్ ను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా అనేక విజయాలు వెన్నువెంటనే ఈమెకు రావడం దానితో చాలా తక్కువ కాలం లోనే ఈ బ్యూటీ తెలుగు పరిశ్రమలో టాప్ హీరోయిన్ స్థానానికి వెళ్లిపోవడం జరిగిపోయింది.

ఆ తర్వాత ఈమెకు కోలీవుడ్ ఇండస్ట్రీ నుండి అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగా ఈమెకు తమిళ ఇండస్ట్రీ లో కూడా వరుస విజయాలు దట్టడంతో అక్కడ కూడా ఈమె టాప్ హీరోయిన్ స్థానానికి వెళ్లిపోయింది. ఇలా టాలీవుడ్ , కోలీవుడ్ ఇండస్ట్రీలలో అద్భుతమైన అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా ఇండియన్ వెర్షన్ సిటాడెల్ లో కనిపించనుంది. ఇందులో ఈ బ్యూటీ బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ తో కలిసి నటించింది.

ఇలా ఇప్పటికే బాలీవుడ్ నటులతో నటించిన ఈమె తాజాగా మరో హిందీ నటుడితో నటించింది. అసలు విషయం లోకి వెళితే ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రన్వీర్ సింగ్ తో తాజాగా నటించింది. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ జొమాటో యొక్క కొత్త ప్రకటనలో భాగంగా వీరిద్దరూ కలిసి కనిపించారు. భారత క్రికెటర్ పుజారా కూడా ఇందులో వారితో చేరారు. ఈ వీడియో కి సంబంధించిన ప్రోమోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఇక తిరిగి సమంత షూటింగ్ లతో బిజీ కావడంతో ఈమె అభిమానులు చాలా ఆనంద పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: