మొదటి బ్రేకప్ తర్వాత అలా ఎప్పుడు చేయలేదు... విద్యాబాలన్..!

MADDIBOINA AJAY KUMAR
బాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోయిన్లలో విద్యాబాలన్ ఒకరు. ఈమె సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా రూపొందిన డర్టీ పిక్చర్ మూవీతో ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. ఆ సినిమా తర్వాత నుండి కూడా ఈ బ్యూటీ ఎక్కువ శాతం కమర్షియల్ సినిమాలలో నటించకుండా చాలా వరకు లేడీ ఓరియంటెడ్ సినిమాలలో ప్రధాన పాత్రలో నటిస్తూ తన కెరీర్లు ముందుకు సాగిస్తుంది.

తాజాగా విద్యాబాలన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా ఈమె తన కాలేజీ లైఫ్ లో జరిగిన ఒక లవ్ స్టోరీ గురించి ఆ తర్వాత కొన్ని లవ్ స్టోరీస్ గురించి చివరగా పెళ్లి గురించి అనేక విషయాలను చెప్పుకొచ్చింది. విద్యాబాలన్ తాజాగా మాట్లాడుతూ ... కాలేజీ చదువుతున్న రోజుల్లో నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. కానీ అతడు చాలా పెద్ద పోకిరి అని నాకు ప్రేమించిన కొన్ని రోజులకే తెలిసింది. ఇలాంటి వాడినా నేను ప్రేమించింది అనుకున్నాను.

ఆ తర్వాత బ్రేకప్ చెప్పి అతనికి దూరంగా ఉన్నాను. కానీ బ్రేకప్ చెప్పి అతనికి దూరంగా ఉన్నా కొన్ని రోజులవపాటు నాకు పిచ్చెక్కినట్లు అయ్యింది అని విద్యాబాలన్ చెప్పుకొచ్చింది. అలాగే కాలేజీ రోజుల్లో మొదటి బ్రేకప్ అయిన తర్వాత కూడా కొంతమందిని నేను ప్రేమించాను. కాకపోతే ఆ మొదటి బ్రేకప్ ఎక్స్పీరియన్స్ వల్ల నేను ఎవరితో అంత డీప్ గా వెళ్లలేదు.

నేను ఆ తర్వాత సిద్ధార్థ్ నే డీప్ గా ప్రేమించాను. అతడినే నేను పెళ్లి చేసుకున్నాను అని విద్యాబాలన్ తన జీవితంలో జరిగిన లవ్ స్టోరీస్ మరియు బ్రేకప్స్ , పెళ్లి గురించి తాజా ఇంటర్వ్యూలో భాగంగా ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఇకపోతే ప్రస్తుతం కూడా ఈ బ్యూటీ చేతిలో అనేక క్రేజీ మూవీలు ఉన్నాయి. ఈమె ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ లతో ఫుల్ బిజీగా కెరియర్ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: