వరలక్ష్మి పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి.. అంత పెద్ద కూతురు ఉందా?
అయితే ఇక ఇప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్ ఓ ఇంటి కోడలుగా మారెందుకు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. గ్యాలరిస్ట్ నికోలై సచ్ దేవ్ ని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయింది. ఇటీవల ఎంగేజ్మెంట్ కూడా జరగగా.. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. అయితే అందరికీ తెలిసిన హీరోయిన్ పెళ్లి చేసుకుంటుంది అంటే ఆ వ్యక్తి గురించి తెలుసుకునేందుకు అభిమానులు సోషల్ మీడియాలో వెతకడం సర్వసాధారణం. వరలక్ష్మి అభిమానులకు కూడా సచ్ దేవ్ గురించి ఇలాగే సోషల్ మీడియాలో వెతికితే వారికి షాకింగ్ విషయాలు తెలిసాయ్.
17 ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న సచ్ దేవ్ ని ఇప్పుడు వరలక్ష్మి పెళ్లి చేసుకోబోతుందట. అయితే వయసులో కూడా వరలక్ష్మి ఎంతో చిన్నది అనేది తెలుస్తుంది. అంతేకాదు వరలక్ష్మి పెళ్లి చేసుకోబోయే సచ్ దేవ్ కి ఏకంగా 15 ఏళ్ల కూతురు కూడా ఉందట. అతని మొదటి భార్య పేరు కవిత. ఈమె మోడలింగ్ చేస్తూ అందాల పోటీల్లో పాల్గొంది. 2007 నుంచి 2014 వరకు రకరకాల పోటీల్లో ఆమె పాల్గొని ఫైనల్ వరకు చేరుకుంది. ఇక వీరికి పెళ్లి తర్వాత కొన్నాళ్లకే విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఈ జంటకు పుట్టిన అమ్మాయి ఇటీవల అథ్లెటిక్స్ లో ఛాంపియన్గా కూడా మెరిసింది. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. 15 ఏళ్ల కూతురు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం వరలక్ష్మికి ఎందుకు వచ్చిందా అనే విషయంపై చర్చించుకుంటున్నారు.