హాభారతం మూవీ గూర్చి రాజమౌళి అప్డేట్ ఇవ్వబోతున్నారా...?
ఇక ఈ సినిమా పరిస్థితి ఇలా ఉంటే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహా భరతం సినిమాను ఎప్పుడు తీస్తాడు అని ఆయన అభిమానులు విపరీతంగా ఎదురు చూస్తున్నారు. ఇక దాని మీద కూడా రీసెంట్ గా రాజమౌళి ఒక అప్డేట్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. అది ఏంటి అంటే మహేష్ బాబు సినిమా అయిపోయిన వెంటనే తను మహాభారతం మొదలు పెట్టబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి... ఇక దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే రాజమౌళి తొందర్లోనే పెట్టే ప్రెస్ మీట్ లో మహేష్ బాబు సినిమాతో పాటు మహాభారతం సినిమాలకు సంబంధించిన అప్డేట్ ను కూడా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మహాభారతం సినిమా కనక రాజమౌళి తీసినట్లైతే వరల్డ్ లోనే అదొక బెస్ట్ సినిమాగా నిలిచిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు... చూడాలి మరి ఈ సినిమాని ఎప్పుడు సెట్స్ మీదకి తీసుకు వెళుతారు అనేది...ఒక వేళ ఈ సినిమాను కనక తీస్తే దాని కోసం రాజమౌళి ఎన్ని సంవత్సరాలు తీసుకుంటాడు అనేది కూడా తెలియాల్సి ఉంది..