అఫీషియల్ : రజిని "వెట్టైయన్" రిలీజ్ అప్డేట్ వచ్చేసింది..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ రజనీ కాంత్ కొంత కాలం క్రితం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన జైలర్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో రజిని అదిరిపోయే రేంజ్ విజయాన్ని ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఈ మూవీ తర్వాత రజినీ తన కూతురు అయినటువంటి ఐశ్వర్య రజనీ కాంత్ దర్శకత్వంలో రూపొందిన లాల్ సలామ్ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించాడు.


కాకపోతే ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ప్రస్తుతం రజిని , సూర్య హీరో గా రూపొందిన జై భీమ్ సినిమాకు దర్శకత్వం వహించి దర్శకుడుగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న వెట్టెయన్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో అమితాబచ్చన్ కీలకమైన పాత్రలో కనిపించనుండగా అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే తాజాగా ఈ  మూవీ బృందం వారు ఈ సినిమా విడుదలకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు.


ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసారు. ఇక ఈ మూవీ బృందం వారు తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో రజిని అదిరిపోయే స్టైలిష్ లుక్ లో చేతిలో గన్ పట్టుకొని నిలుచును ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా నటిస్తున్న మూవీ కావడం ఈ సినిమాకు టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ మూవీ పై తమిళ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: