పిల్లల్ని కనడం కన్నా.. కుక్కల్ని పెంచుకోవడం బెటర్ : హీరోయిన్

praveen
మహిళగా పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా మాతృత్వం అనేది ఒక గొప్ప అనుభూతి అన్న విషయం తెలిసిందే. అయితే ఈ అనుభూతిని పొందాలని ప్రతి ఒక్క మహిళ కూడా ఆశపడుతూ ఉంటుంది. పిల్లలతో అమ్మ అని పిలిపించుకుంటే ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేని విధంగా ఉంటుంది అని ఎంతో మంది చెబుతూ ఉంటారు. అయితే నేటి రోజుల్లో మాత్రం కొంతమంది సెలబ్రిటీలు మాతృత్వపు అనుభూతిని పొందేందుకు కూడా వెనక ముందు ఆలోచిస్తున్న పరిస్థితి.

 ఏకంగా పిల్లలను కనేందుకు సరోగసి పద్ధతిని ఆశ్రయిస్తున్నారు ఎంతోమంది. ఏకంగా 9 నెలలు బిడ్డను మోయడానికి కూడా ఓపిక లేని స్థితిలో కొంతమంది ఉన్నారు. అయితే ఇంకొంతమంది మాత్రం ఏకంగా ఈ మాతృత్వపు అనుభూతిని సరోగసి లాంటి పద్ధతులను కాకుండా తన గర్భంలోనే  బిడ్డను మోయాలని ఇక అనుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక హీరోయిన్ మాత్రం ఏకంగా మాతృత్వపు అనుభూతి గురించి పిల్లలను కనడం గురించి చేసిన కామెంట్స్ కాస్త సంచలనంగా మారిపోయాయి. పిల్లలను కనడం కంటే ఏకంగా కుక్కలను పెంచుకోవడం బెటర్ అంటూ ఆ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది.

 ఈ క్రమంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేసి ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది ఆ హీరోయిన్. ఇలా మాతృత్వం పై కన్నడ నటి హిత చంద్రశేఖర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి. మీకు పెళ్లయి నాలుగేళ్లు అవుతున్న ఎందుకు పిల్లల్ని కనలేదు అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్నించింది. అయితే ఈ ప్రశ్నకు ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. నాకు పిల్లలను కనాలనే ఉద్దేశం లేదు. ఈ విషయంలో నాకు నా భర్త మద్దతు కూడా ఉంది. నా దృష్టిలో సొంత పిల్లలను కనడం కన్నా.. ఒక కుక్కను పెంచుకొని సొంత పిల్లల్లా చూసుకోవడం మంచిది. ఇక వృద్ధాప్యం గురించి కూడా నాకు ఎలాంటి బాధ లేదు అంటూ హిత చంద్రశేఖర్ కామెంట్స్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: