తమిళ్ స్టార్ డైరెక్టర్ తో మూవీ కన్ఫామ్ చేసిన నాని..?

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని ఎప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంటాడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. చాలా మంది హీరోల మాదిరి ఒక దర్శకుడి కోసం వెయిట్ చేస్తూ కాలాన్ని వృధా చేయకుండా ఎప్పుడు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉండడం మాత్రమే కాకుండా తన ఫ్యాన్స్ కు కూడా సంవత్సరానికి రెండు , మూడు సినిమాలను అందిస్తూ వారిని కూడా ఆనంద పరుస్తూ ఉంటాడు. నాని పోయిన సంవత్సరం చివరలో డిసెంబర్ నెలలో విడుదల అయినటువంటి హాయ్ నాన్న అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు.


ఇక ప్రస్తుతం ఈయన వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సరిపోదా శనివారం అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉండగానే నాని టాలీవుడ్ యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో ఓ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలాగే బలగం మూవీ తో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న వేణు దర్శకత్వంలో కూడా ఓ మూవీ లో నటించడానికి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇకపోతే తాజాగా ఈ హీరో మరో క్రేజీ దర్శకుడి సినిమాకు కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.


అసలు విషయం లోకి వెళితే సూర్య హీరో గా రూపొందున జై భీమ్ మూవీ కి దర్శకత్వం వహించిన టీజే జ్ఞానవేల్ తాజాగా నాని కి ఓ కథను వినిపించినట్లు ... కథ మొత్తం విన్న నాని కి ఆయన చెప్పిన కథ సూపర్ గా అనిపించడంతో వెంటనే ఈయన దర్శకత్వంలో మూవీ చేయడానికి నాని ఓకే చెప్పినట్లు మరికొన్ని రోజుల్లోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు బయటికి రాబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: