"తలైవా 171" నుంచి బిగ్ అప్డేట్.. లోకేష్ భారీగా ప్లాన్ చేసాడుగా..!!

murali krishna
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గత ఏడాది 'జైలర్' సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నారు.. వరుస ప్లాప్స్ తో ఇబ్బందిపడుతున్న తలైవాకు “జైలర్” మూవీ అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చింది.ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్  వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు. యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో తలైవా తన 171వ సినిమా చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ వస్తుందనే అనౌన్స్ మెంట్ కోలీవుడ్ ప్రేక్షకులలో ఒక్కసారిగా అంచనాలు అమాంతం పెంచేసాయి.లోకేష్ కనగరాజ్ కోలీవుడ్ స్టార్ హీరోలతో ఓ సినిమాటిక్ యూనివర్సల్ క్రియేట్ చేసి దర్శకుడిగా భారీ క్రేజ్ తెచ్చుకున్నారు.

లోకేష్ కనగరాజ్ రజినీకాంత్ తో సినిమా చేస్తున్నాడు అనగానే సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ వైరల్ అవుతుంది.ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర ఉండనుందని తెలుస్తుంది.ఆ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటిస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.రజినీకాంత్ పాత్రకు సమానంగా ఆ పాత్ర ఉండడంతో లోకేష్ ఆ పాత్రను ఓ స్టార్ హీరోతో చేయించాలని అనుకున్నాడని సమాచారం..దీనితో గత కొద్ది రోజులుగా రణవీర్ సింగ్ తో లోకేష్ సంప్రదింపులు కూడా జరపగా.. రణవీర్ సింగ్ రజినీకాంత్ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపించినట్లు సమాచారం.

త్వరలోనే ఈ విషయం పై మేకర్సఅధికారికంగా ప్రకటించనున్నారు..అయితే ముందుగా ఈ పాత్ర కోసం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ని సంప్రదించగా.. ఆయన సున్నితంగా తిరస్కరించడంతో రణ్ వీర్ సింగ్ కు ఆ పాత్ర దక్కినట్లు సమాచారం. 'తలైవా 171'  మూవీ జూన్ లో సెట్స్ మీదికి వెళ్ళనుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈనెల 22న గ్రాండ్ గా లాంచ్ చేయడంతో పాటు అదే రోజు టైటిల్ని కూడా రివీల్ చేయనున్నట్లు సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: