మెగాస్టార్ చిరంజీవి ఉదయం లేవగానే.. ముందు ఆమె ఫోటోనే చూస్తారట తెలుసా?

praveen
మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. మరీ ముఖ్యంగా కొత్తగా ఇండస్ట్రీ లోకి రావాలి అనుకునే వారికి మెగాస్టార్ పేరు గురించి కొత్తగా చెప్తే అది అతిశయోక్తి అవుతుంది. ఎందుకంటే ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా స్వయం కృషిని నమ్ముకుని ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన చిరంజీవి.. సరికొత్త ట్రెండు సృష్టించారు. అప్పటికే ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ లాంటి స్టార్ హీరోలు ఇండస్ట్రీని ఏలుతున్న సమయం లో ఇక చిరంజీవి ఎంతో కష్టపడి పైకి ఎదిగారు.

 దాదాపు మూడు దశాబ్దాల నుంచి కూడా మెగాస్టార్ తెలుగు చిత్ర పరిశ్రమం లో స్టార్ హీరో గానే కొనసాగుతున్నారు. ఇక ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దగా కూడా ఇక ఎప్పుడు ఎవరికీ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ భరోసా ఇస్తూ ఉంటారు. అయితే మెగాస్టార్ ఇప్పటివరకు 150 కి పైగా సినిమాల్లో నటించగా.. ఇక ఆయన కెరియర్ లో హిట్ సినిమాలు ఏవి ఫ్లాప్ సినిమాలు ఏవి అన్న విషయం అందరికీ తెలుసు. ఇక మెగాస్టార్ పర్సనల్ లైఫ్ గురించి కూడా దాదాపు అందరికి తెలుసు అని అభిమానులు అనుకుంటూ ఉంటారు. కానీ ఇటీవల ఎవరికి తెలియని ఒక ఆసక్తికర విషయం తెర మీదకు వచ్చింది.

 మెగాస్టార్ చిరంజీవి గురించి ఎవరికీ తెలియని విషయాన్ని ఇటీవల బయట పెట్టింది మహానటి సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి . మెగాస్టార్ చిరంజీవి ఉదయం నిద్ర లేవగానే మొదట సావిత్రమ్మ ఫోటోనే చూస్తారు  ఒకసారి మెగాస్టార్  గారి ఇంటికి వెళ్లినప్పుడు ఈ విషయం నాకు తెలిసింది అంటూ సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి చెప్పుకొచ్చారు. కాగా సావిత్రమ్మ అప్పట్లో అగ్ర తారగా ఇండస్ట్రీ లో కొనసాగింది. ఇక హీరోలను తలదన్నే పారితోషకం సైతం తీసుకొని ఏకచక్రాధిపత్యాన్ని కొనసాగించింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: