టిల్లు స్క్వేర్ ఖాతాలో మరో రేర్ రికార్డ్?

Purushottham Vinay
ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సీక్వెల్స్, రెండు పార్ట్‌ లు, ప్రాంచైజీ సినిమాలు చాలా ఎక్కువ అవుతున్నాయి. సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా గడచిన పదేళ్లలో ఈ ట్రెండ్ బాగా నడుస్తోంది.అయితే సీక్వెల్స్, రెండో పార్ట్‌ ల్లో చాలా తక్కువ సినిమాలు మాత్రమే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మొదటి పార్ట్‌ కంటే రెండో పార్ట్‌ భారీ విజయాలు సాధించిన సినిమాలు చాలా తక్కువ మాత్రమే ఉన్నాయి. అందులో బాహుబలి 2  కేజీఎఫ్ 2 సినిమాలు ముందు ఉంటాయి. తరువాత కార్తికేయ 2 ఇంకా బంగార్రాజు సినిమాలు కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. తాజాగా ఈ జాబితాలో టిల్లు స్క్వేర్ సినిమా నిలిచింది. డీజే టిల్లు సినిమాకి కొనసాగింపు అన్నట్లుగా వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమా మొదటి పార్ట్‌ తో పోల్చితే రెట్టింపు విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో ఈ స్థాయి పక్కా బ్లాక్ బస్టర్ టాలీవుడ్‌ కి లేదని చెప్పాలి. మూడు రోజులు కూడా ముగియకుండానే బ్రేక్ ఈవెన్ సాధించి భారీ లాభాల దిశగా టిల్లు స్క్వేర్ సినిమా దూసుకు పోతుంది. సిద్దు జొన్నలగడ్డ హీరో గా అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమాను సితార ఎంటర్‌ టైన్‌మెంట్స్ బ్యానర్ లో నాగ వంశీ నిర్మించడం జరిగింది.


చాలా కాలంగా వరుస సినిమాలతో నిరాశే మిగులుతున్న సితార వారికి ఈ సినిమా భారీగా లాభాల పంట పండించే అవకాశాలున్నాయని బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సౌత్ నుంచి వచ్చిన సీక్వెల్స్ లో బాహుబలి, కేజీఎఫ్, కార్తికేయ 2 సినిమాలు అత్యధిక వసూళ్లు దక్కించుకున్నాయి. ఇప్పుడు టిల్లు స్క్వేర్ వాటి తర్వాత స్థానంలో నిలిచే అవకాశాలు ఉన్నాయి.లాంగ్ రన్ లో కార్తికేయ 2 ని దాటేయొచ్చు.నిజంగా ఇది ఒక రేర్ రికార్డ్.‘టిల్లు స్క్వేర్’ మూవీకి రూ.23.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.24 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజులు ముగిసేసరికి ఈ సినిమా రూ.38.98 కోట్ల షేర్ ను రాబట్టి.. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా ఏకంగా రూ.14.98 కోట్ల లాభాలు రాబట్టి బ్లాక్ బస్టర్ లిస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. గ్రాస్ పరంగా 78 కోట్ల దాకా ఈ సినిమా వసూళ్లు రాబట్టింది.ఈ ఏడాది రాబోతున్న పుష్ప 2, వచ్చే ఏడాది రాబోతున్న సలార్ 2 తో పాటు దేవర 2 సినిమాలు ఎలాంటి వసూళ్లు సాధిస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: