'జై హనుమాన్ 'పై స్టన్నింగ్ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ..!!

murali krishna
టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా హీరోగా, టాలెంటెడ్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ “హనుమాన్”.. సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయిన ఈ మూవీ అద్భుత విజయం సాధించింది. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ ఏకంగా రూ.300 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక లాభాలు అందించిన చిత్రాల్లో ఒకటిగా హనుమాన్ మూవీ నిలిచింది.ఇదిలా ఉంటే రీసెంట్ గా దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’మూవీకు సీక్వెల్ గా ‘జై హనుమాన్’ సినిమాను ప్రకటించారు.. ఇప్పటికే స్క్రిప్ట్ కంప్లీట్ అయి ప్రీ-ప్రొడక్షన్ కూడా ప్రారంభించామని ప్రశాంత్ వర్మ ప్రకటించారు.తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ ను అందించారు.‘హనుమాన్’ కథ అంతా అంజనాద్రి అనే కల్పిత గ్రామంలోనే జరుగుతుంది. ఆ గ్రామానికి సినిమాలో చాలా ప్రాధాన్యత ఉంటుంది.

దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీ కోసం చాలా జాగ్రత్తగా ఆ గ్రామాన్ని డిజైన్ చేశారు. ఇప్పుడు ‘జై హనుమాన్’ కోసం ఆ గ్రామాన్ని అప్గ్రేడ్ చేయనున్నారని సమాచారం.అంజనాద్రి 2.0 అంటూ కొత్త విజువల్స్ ని ‘జై హనుమాన్’ మూవీలో చూపించనున్నారు. దీనికి సంబంధించి తాజాగా చిన్న గ్లింప్స్ ని కూడా విడుదల చేశారు. ఈ గ్లింప్స్ లో నీటిలో వస్తున్న కొన్ని పడవలను చూపించారు.ఈ గ్లింప్స్ ని ట్యాగ్ చేస్తూ ‘అంజనాద్రి 2.0’కు స్వాగతం అని ప్రశాంత్ వర్మ  ట్వీట్ చేశారు.‘హనుమాన్’మూవీ అంతా అంజనాద్రికి సంబంధించిన గ్రామంలోనే  జరుగుతుంది. ఆ గ్రామం పక్కన కనిపించే నది, జలపాతాలను కూడా ‘జై హనుమాన్’లో మరింత అద్భుతంగా తెరకెక్కించనున్నారు. ఇదిలా ఉంటే ఉగాది రోజు కూడా ‘జై హనుమాన్’కు సంబంధించిన అప్డేట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.. ఉగాది ఈజ్ కమింగ్ అంటూ ప్రశాంత్ వర్మ శనివారం ట్వీట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: