నాకు లవ్ లో పడాలని ఉంది.. ఓపెన్ అయిన హీరోయిన్?

praveen
మృనాల్ ఠాగూర్.. ఈమె గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే అప్పటివరకు కొంతమందికి మాత్రమే తెలిసిన ఈ హీరోయిన్.. సీతారామం అనే ఒక క్లాసిక్ హిట్టుతో తెలుగు ప్రేక్షకులందరికీ కూడా దగ్గర అయింది. కేవలం తెలుగు ప్రేక్షకులేనా సౌత్ ఇండస్ట్రీలోని ప్రేక్షకులు అందరూ కూడా మృనాల్ ఠాగూర్ ను తమ ఫేవరెట్ హీరోయిన్గా మార్చుకున్నారు అని చెప్పాలి. తన అందం అభినయంతో అందరిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఒకవైపు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ  తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది ఈ హీరోయిన్.

కాగా గత ఏడాది హాయ్ నాన్న అనే సినిమాతో నానితో జతకట్టిన ఈ ముద్దుగుమ్మ.. సూపర్ హిట్ను ఖాతాలో వేసుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఫ్యామిలీ స్టార్ అనే మూవీలో నటిస్తుంది. ఇక ఈ సినిమాతో కూడా హిట్టు కొట్టేలాగే కనిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మృనాల్ ఠాగూర్ తన పర్సనల్ లైఫ్ లో రిలేషన్షిప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలను చేసింది. ఏకంగా తనకు ప్రేమలో పడాలని అనిపిస్తుంది అంటూ ఈ స్టార్ హీరోయిన్ ఓపెన్ అయింది.

 నేను ఇప్పుడు వరకు ఏ రిలేషన్ షిప్ లో కూడా లేను. షూటింగ్స్ కారణంగా బిజీ బిజీగా ఉండడంతో చివరికి పర్సనల్ లైఫ్ ని ఎంతగానో మిస్ అయిపోతున్నాను. నాకు అందరి లాగానే సాధారణ జీవితం గడపాలని ఉంది. 20 ఏళ్లకే పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల్ని కనాలని అనుకున్నాను. కానీ ఇక సినిమా ఇండస్ట్రీ లోకి రావడంతో అది కుదరలేదు. నాకు మరణం అంటే ఎంతో భయం. ఒకవేళ నేను చనిపోతే నా కుటుంబం ఏమవుతుందో అని నేను ఎప్పుడూ భయపడుతూ ఉంటాను అంటూ ఈ స్టార్ హీరోయిన్ తన పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: