అదిరిపోయే లైనప్ ను సెట్ చేసుకున్న శ్రీ విష్ణు..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస విజయాలతో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న హీరోలలో శ్రీ విష్ణు ఒకరు. ఈయన పోయిన సంవత్సరం సామజవరగమన అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఇలా పోయిన సంవత్సరం సామజవరగమన మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న ఈయన తాజాగా "ఓం భీమ్ బుష్" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యింది.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకుంది.  ప్రస్తుతం ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ కలెక్షన్ లను రాబడుతుంది. ఇక మరి కొన్ని రోజుల్లోనే ఈ సినిమా కూడా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ స్టేటస్ ను అందుకునే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న శ్రీ విష్ణు ఇప్పటికే తన తదుపరి 2 మూవీ లను సెట్ చేసి పెట్టుకున్నాడు. శ్రీ విష్ణు మరికొన్ని రోజుల్లో "స్వాగ్" అనే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు.

ఈ మూవీ తర్వాత శ్రీ విష్ణు ... గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఓ ద్రిల్లర్ మూవీ లో నటించబోతున్నాడు. ఈ మూవీ కి కోనా వెంకట్ దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా వరుస విజాయలతో ఫుల్ జోష్ లో ఉన్న శ్రీ విష్ణు తన తదుపరి 2 మూవీ లను కూడా ఇప్పటికే ఓకే చేసుకున్నాడు. ఇలా ఈయన ప్రస్తుతం ఫుల్ జోష్ లో తన కెరీర్ ను ముందుకు సాగిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

sv

సంబంధిత వార్తలు: