ఎస్ జె సూర్య ఈ
మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే చాలా రోజుల క్రితం ఈ
మూవీ నుండి "జరగండి జరగండి తప్పుకోండి" అంటూ సాగే ఓ సాంగ్ లిక్ అయింది. దానితో ఈ చిత్ర బృందం ఈ సాంగ్ ను అఫీషియల్ గా విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమీ తెలియదు కానీ ఈ సాంగ్ ను మాత్రం ఈ చిత్ర బృందం విడుదల చేయలేదు.
ఇకపోతే గత కొంత కాలంగా ఈ సంవత్సరం చరణ్ పుట్టిన రోజు సందర్భంగా "గేమ్ చేంజర్"
మూవీ లోని "జరగండి" అంటూ సాగే సాంగ్ ను ఈ చిత్ర బృందం విడుదల చేయబోతున్నట్లు అనేక వార్తలు వచ్చాయి. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువబడింది. తాజాగా ఈ
మూవీ బృందం వారు
గేమ్ ఈ సినిమాలోని మొదటి సాంగ్ అయినటువంటి "జరగండి" అంటూ సాగే సాంగ్ ను రేపు అనగా
మార్చి 27 వ తేదీన ఉదయం 9 గంటల 03 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ
పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ
పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.