దేవిశ్రీప్రసాద్ వల్లే పెళ్లి కాలేదన్న హైపర్ ఆది..!!

Divya
టాలీవుడ్ ఇండస్ట్రీలో అటు బుల్లితెరపై వెండి తేర పైన హైపర్ ఆదికి ప్రత్యేకమైన స్థానం ఉన్నది.. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని కెరియర్ పరంగా కమెడియన్ గా ముందుకు వెళుతున్న హైపర్ ఆది పెళ్లి విషయంలో అభిమానులు ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతారా అంటూ చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ హైపర్ ఆది వయసు 33 సంవత్సరాలు.. ఈఎడదైనా హైపర్ ఆది వివాహం చేసుకుంటారా అని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు తాజాగా దేవిశ్రీప్రసాద్ వల్లే తాను పెళ్లి చేసుకోలేదంటూ పలు రకాల కామెంట్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు హైపర్ ఆది.

అయితే ఈ విషయం పైన దేవిశ్రీప్రసాద్ కూడా రివర్స్ లోనే కామెంట్స్ చేశారు.. గామా టాలీవుడ్ అవార్డ్స్ లో ఏడాది వేడుక దుబాయిలో చాలా గ్రాండ్గా జరిగింది. అందుకు సంబంధించిన తాజాగా ప్రోమో కూడా విడుదలైంది. త్వరలోనే ఈవెంట్ ని సైతం బుల్లితెర పైన ప్రసారం చేయబోతున్నారు.. అయితే ఈవెంట్లో అటు యాంకర్ సుమ అశ్వని దత్ ను కల్కి చిత్ర బృందం గురించి అప్డేట్ ను కూడా అడగడం జరిగింది.. వీరితోపాటు తేజ సజ్జ, మంచు మనోజ్, థమన్ తదితర సినీ ప్రముఖులు కూడా ఈవెంట్ కి హాజరయ్యారు

అయితే ఈ ప్రోమో విషయానికి వస్తే.. చివరిలో హైపర్ ఆది  ఒక్కసారిగా వన్ సైడ్ లవ్ బెటర్ అంటారు.. ఇంకోసారి లవ్ చేయాలా వద్దా అంటారు.. అయితే ఏం చేయాలో తెలియక తాను సింగల్ గానే ఉండిపోయాను అంటూ హైపర్ ఆది తెలియజేశారు.. అలాంటి సమయంలోనే మరి నేను అంటూ కూడా దేవిశ్రీప్రసాద్ కౌంటర్ వేయడం జరిగింది.. అందుకు సంబంధించిన ఈ ప్రోమో సైతం వైరల్ గా మారుతోంది.. హైపర్ ఆది ఎక్స్ ట్రా జబర్దస్త్ తో పాటు పలు సినిమాలలో నటిస్తు బిజీగా ఉన్నారు. రెమ్యూనరేషన్ కూడా భారీగానే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. హైపర్ ఆది కామెడీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: