పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న.. రామ్ చరణ్ హాట్ హీరోయిన్?

praveen
ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా కూడా ఎన్నికల హడావిడి కనిపిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా అన్ని పార్టీలు కూడా పావులు కదుపుతూ ఉన్నాయి. ఎప్పటిలాగానే పార్టీలన్నీ కూడా విమర్శలు ప్రతి విమర్శలతో బిజీబిజీగా ఉన్నాయి అని చెప్పాలి. ఇక ప్రచార హోరుతో ఓటర్ మహాశయులను ఆకట్టుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసేందుకు అందరు అభ్యర్థులు సిద్ధమైపోతున్నారు. ఇక కొన్ని పార్టీలు అయితే ఏకంగా సినీ సెలబ్రిటీలను కూడా బరిలోకి దింపేందుకు రెడీ అవుతున్నాయి అని చెప్పాలి.

 ఇక లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీలు కొన్ని కొన్ని స్థానాల నుంచి పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. ఇక వారి పేర్లను కూడా పార్టీలు అధికారికంగా ప్రకటించాయి అన్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు ఏకంగా రామ్ చరణ్ సరసన హీరోయిన్గా నటించిన ఒక హాట్ బ్యూటీ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతుంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. చరణ్ డెబ్యూ  మూవీ అయినా చిరుత సినిమాలో చరణ్ తో రొమాన్స్ చేసింది నేహా శర్మ. ఇక తన అందం అభినయంతో ఆకట్టుకుంది అన్న విషయం తెలిసిందే. తన లుక్స్ తో కుర్ర కారు మతి  పోగొట్టింది ఈ సొగసరి. తర్వాత కొన్ని సినిమాలలో నటించిన పెద్దగా గుర్తింపును మాత్రం సంపాదించుకోలేకపోయింది అని చెప్పాలి.

 అయితే ఇప్పుడు హీరోయిన్ నేహా శర్మ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోతుందట. కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగే ఛాన్స్ ఉంది అన్నది తెలుస్తుంది. ఇండియా కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా బీహార్ లోనే భగల్పూర్ సీటు కాంగ్రెస్కు వస్తే తాను లేదా తన కూతురు పోటీచేయాలని భావిస్తున్నట్లు నేహా శర్మ తండ్రి అజయ్ శర్మ చెప్పుకొచ్చారు. కాగా ప్రస్తుతం అజయ్ శర్మ భగల్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇలా పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై  కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరుగుతున్నట్లు అజయ్ శర్మ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: