రోజు ఆ ఫుడ్ తినిపించేవాడినే పెళ్లి చేసుకుంటా... ఈ క్రేజీ బ్యూటీ..!

Pulgam Srinivas
తెలుగు అమ్మాయి ప్రసాద్ కోమలి గురించి ప్రత్యేకం గా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ బ్యూటీ ఇప్పటికే హిట్ 2 ... నేను సీతాదేవి ... శశివదనే అనే సినిమా లలో నటించింది . ఈ సినిమా లలో ఈ ముద్దు గుమ్మ నటించిన "హిట్ 2" మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది . ఈ మూవీ ద్వారా ఈ బ్యూటీ కి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది.


ఇకపోతే ఈ బ్యూటీ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది . ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఈమె అనేక ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది .  తాజా ఇంటర్వ్యూ లో భాగంగా ఈ బ్యూటీ మాట్లాడుతూ ... నేను తెలుగు అమ్మాయిని. నేను తెలుగు అమ్మాయిని కాబట్టి నాకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి సినిమా అవకాశాలు దక్కుతున్నాయి . నా గురించి తెలియని వాళ్ళు నన్ను చూడు నేను బొంబాయి నుండి వచ్చిన అమ్మాయిని అని అనుకుంటారు అని ఈ బ్యూటీ తెలియ జేసింది . అలాగే తన పెళ్లి కి సంబంధించిన విషయాలను తనకు ఎలాంటి భర్త కావాలి అనే దాని గురించి కూడా ఈ నటి తెలియజేసింది.


ప్రతి రోజు జోక్స్ వేస్తూ ఒక పూట బిర్యాని తినిపించేవాడినే పెళ్లి చేసుకుంటాను అని ఈ బ్యూటీ చెప్పకు వచ్చింది. ఇకపోతే పెళ్లి గురించి ఈ బ్యూటీ చేసిన వ్యాఖ్యలు చాలా ఫన్నీగా ఉండడంతో ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం కూడా ఈ ముద్దు గుమ్మ చేతిలో అనేక క్రేజీ సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

pk

సంబంధిత వార్తలు: