సూర్య ఫ్యాన్ గర్ల్ కు దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన జ్యోతిక...??

murali krishna
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అంటే టాలీవుడ్‪లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక్కడ తెలుగు హీరోలకు పోటీగా.. ఆయన సినిమాకు కూడా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను రాబట్టుకుంటాయి. రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత సూర్య చిత్రాలను ఆదరిస్తుంటారు తెలుగు ప్రేక్షకులు. రక్త చరిత్ర 2లో కనిపించడం తప్ప..మరో తెలుగు సినిమా చేయలేదు. ఇక సూర్య తన డబ్బింగ్ చిత్రాలకు ఇక్కడ వారికి చేరువయ్యారు. గజినీ, ఆరు, నువ్వు నేను ప్రేమ, సింగం, సెవన్త్ సెన్స్, 24, ఆకాశమే నీ హద్దురా, జైం భీమ్, ఈటీ, విక్రమ్ చిత్రాలు ఫ్యాన్స్ ఏర్పడేలా చేశాయి. ఇప్పుడు కంగువాతో ఫుల్ బిజీలో ఉన్నారు. ఇటీవల విడుదలైన టీజర్ మూవీపై అంచనాలను పెంచేసింది.ఇక ఆయన భార్య జ్యోతిక కూడా సెకండ్ ఇన్నింగ్స్‌లో అదరగొట్టేస్తుంది.జ్యోతిక తెలుగులో ముచ్చటగా మూడు సినిమాలు చేసింది. ఠాగూర్, మాస్, షాక్ చిత్రాలతో అలరించింది. సూర్యను వివాహం చేసుకుని అత్తారింట్లో అడుగుపెట్టాక.. బాధ్యతలు, బంధాలతో ఇండస్ట్రీకి దూరంగా ఉంది. 2015లో 36 వయదినిలే (36 వయస్సులో) రీ ఎంట్రీ.. ఇప్పుడు బాలీవుడ్ మూవీ సైతాన్‌తో భారీ హిట్ అందుకుంది. ఇండస్ట్రీలో ది బెస్ట్ కపుల్స్ లో సూర్య, జ్యోతిక పేరు కచ్చితంగా ఉంటుంది. అయితే సూర్యకు ప్రపంచ వ్యాప్తంగా లేడీ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. అతడి కటౌట్‌కు ఫిదా అయిపోతుంటారు అమ్మాయిలు. సినిమా సినిమాకు లేడీ ఫ్యాన్స్ పెరిగిపోతుంటారు. తాజాగా ఓ లేడీ ఫ్యాన్స్ జ్యోతికను కోరకూడని కోరిక కోరింది. దీంతో జ్యోతిక అదిరిపోయే రిప్లై ఇచ్చింది.'మీ మధ్య దూరం పెరిగింది.. మీరు విడిపోయారు' అంటూ పుకార్లు షికార్లు చేసిన ప్రతిసారి అది రాంగ్‌ అని ప్రూవ్‌ చేస్తూనే ఉన్నారు హీరో సూర్య దంపతులు.కొంతకాలం క్రితం వీరు విడాకులు తీసుకోబోతున్నారని జోరుగా ‍ప్రచారం జరగ్గా జంటగా వెకేషన్‌లో కనిపించి అందరి నోళ్లు మూయించారు. తమ మధ్య ఉన్న ప్రేమను పదేపదే చెప్పుకోవాల్సిన పని లేదని చెప్పకనే చెప్పారు.
సూర్యను పెళ్లి చేసుకున్నాక దాదాపు పదేళ్లపాటు సినిమాలకు దూరంగా ఇచ్చిన జ్యోతిక తర్వాత మళ్లీ మేకప్‌ వేసుకోవడం మొదలుపెట్టింది. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటున్న ఆమె ఇటీవల షైతాన్‌ మూవీలో కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా దాదాపు రూ.150 కోట్ల మేర రాబట్టింది. ఈ సినిమా గురించి చెప్తూ ఎమోషనలైంది జ్యోతిక.
అద్భుతమైన ప్రయాణం.'కొన్ని సినిమాలు కేవలం గమ్యస్థానాలకే తీసుకెళ్తాయి. కానీ షైతాన్‌ అనేది ఒక అందమైన, సంతోషకరమైన, ఎన్నో జ్ఞాపకాలు రంగరించిన అద్భుత ప్రయాణం. ఈ జర్నీలో ఎంతోమంది స్నేహితులు దొరికారు. ఈ ప్రయాణంలో నన్ను భాగం చేసిన దేవ్‌గణ్‌ ఫిలింస్‌, పనోరమ స్టూడియోస్‌, జియో స్టూడియోస్‌ నిర్మాణ సంస్థలకు కృతజ్ఞతలు. టీమ్‌ మొత్తానికి అభినందనలు' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో రిలీజ్‌ చేసింది. ఇందులో షైతాన్‌ టీమ్‌తో పాటు హీరో సూర్యతో కలిసి దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి.ఆయన్ను ఆరాధిస్తున్నా
ఇది చూసిన ఓ అభిమాని.. 'జ్యోతిక మేడమ్‌.. సిల్లును ఒరు కాదల్‌ సినిమాలో లాగా మీ భర్తను ఒకరోజు నాకు అప్పుగా ఇస్తారా? 15 ఏళ్లుగా ఆ జెంటిల్‌మెన్‌కు పెద్ద అభిమానిని' అని కామెంట్‌ చేసింది. దీనికి జ్యోతిక.. 'అలాంటివేమీ కుదరదమ్మా..' అని రిప్లై ఇచ్చింది. ఆ రిప్లై చూసి అభిమాని ఎగిరి గంతేసింది. 'నేను సూర్యకు ఎంత పెద్ద అభిమానినో మీరసలు ఊహించి ఉండరు. నా పేరులో కూడా అతడి పేరును యాడ్‌ చేశాను. ఆయనే నా ఫస్ట్‌ లవ్‌.. నేను ఆయన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ఈ విషయం ఆయనకు చెప్పండి. అయినా మీరు పంచే ప్రేమ ముందు నాదెంతలెండి' అని రాసుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: